ఇవాళ బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఆప్‌ అగ్ర నేతలు వెళ్లబోతున్తనారు. బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఆప్‌ అగ్ర నేతలు వస్తారని.. మోదీ ఎవరినైనా జైలుకు పంపవచ్చని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ప్రధానికి నిన్ననే సవాల్‌ విసిరారు. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా... మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లను కూడా జైలుకు పంపుతామని ఇటీవల బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అందుకే తామే బీజేపీ ఆఫీస్‌కు వస్తామని... తమను జైలుకు పంపాలని కేజ్రీవాల్‌ సవాల్‌ విసురుతున్నారు.

బిభవ్ కుమార్‌ను అరెస్టు చేసిన తర్వాత మాట్లాడిన కేజ్రీవాల్‌... తమ పార్టీ నేతలను జైలుకు పంపడం ద్వారా ఆప్‌ను అణచి వేయలేరని అన్నారు. మనీష్ సిసోదియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ వంటి ఆప్ నేతలను జైలుకు పంపారని.. ఇప్పుడు మరికొందరిని జైలుకు పంపే కుట్రలు చేస్తున్నారని కేజ్రీవాల్‌ మండిపడ్డారు. బీజేపీ ఎంత మంది ఆప్ నేతలను జైలులో పెట్టిందో దానికి రెట్టింపు సంఖ్యలో నాయకులు పుట్టుకొస్తారని కేజ్రీవాల్‌ అన్నారు.మరింత సమాచారం తెలుసుకోండి: