పీర్జాదిగూడ మునిసిపల్ మేయర్, కార్పొరేటర్లపై కాంగ్రెస్ దాడిని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎలాగైనా సరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అందుకే భారాస మేయర్ జక్కా వెంకట్ రెడ్డిని, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు.


ఔటర్ రింగ్ రోడ్డుపై 20 కార్లతో వారిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. భారాస కార్పొరేటర్లపై జరుగుతున్న ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్న మాజీ మంత్రి హరీష్ రావు.. డీజీపీ, రాచకకొండ కమిషనర్ వెంటనే పీర్జాదిగూడ మేయర్ కార్పొరేటర్లకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామిక బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఇలా దాడులకు పాల్పడడం గర్హనీయమని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: