ఏపీలో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపైనా కేసు నమోదు అయ్యింది. ఈనెల 13న పోలింగ్ సందర్భంగా కడప గౌస్ నగర్ లో జరిగిన అల్లర్లపై పోలీసులు అంజాద్ బాషాపై కేసు నమోదు చేశారు. వైకాపా, తెదేపా వర్గాలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రెండు వర్గాలకు సంబంధించి మొత్తం 47 మంది పైన కేసులు నమోదు చేశారు.


ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు.. అంజాద్ భాషాతో పాటు మరో 21 మంది వైకాపా కార్యకర్తలపైనా కేసులు నమోదు చేశారు. అంతే కాదు. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి పైనా కేసు నమోదు చేశారు. శ్రీనివాసులు రెడ్డి తో పాటు మరో 24 మంది తేదేపా కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన వారికి పోలీసులు 41- ఏ నోటీసులు అందజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp