కుంగిన మేడిగడ్డ ఆనకట్ట మరమ్మత్తు పనులు ప్రారంభం అయ్యాయి. అయితే.. ఈ మరమ్మత్తు పనుల్లో భాగంగా అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం ఆనకట్టలో గేట్లను తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. ఏడో బ్లాక్ లో పియర్స్ కుంగిన ప్రాంతంలోని ఏడు గేట్లలో 15వ నంబర్ గేటు తెరిచారు. 16వ గేటు తెరిచే ప్రయత్నంలో ఇబ్బందులను గుర్తించారు. మిగిలిన ఆరు గేట్లలో రెండింటిని మాత్రమే తెరిచేందుకు సాధ్యపడుతుందని ఇంజనీర్లు భావిస్తున్నారు.


మిగతా నాలుగు గేట్లను తెరవడం సాధ్యం కాదని, తెరిచే ప్రయత్నం చేస్తే పియర్స్, ఫౌండేషన్ కు మరిన్ని సమస్యలు వస్తాయన్న విషయం తాజాగా బయటపడింది. అందుకే మిగిలిన నాలుగు గేట్లను కటింగ్ చేసేందుకు నిర్ణయించారు. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ కూడా  గేట్లను తెరవడం సాధ్యం కాకపోతే పూర్తిగా తొలగించాలని సూచించింది. అందుకే ఇప్పుడు నాలుగు గేట్లను కటింగ్ ద్వారా తొలగించే పనులను ప్రారంభించారు. మొదట 20వ నంబర్ గేటును ఈ తరహాలో తొలగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: