ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలంగా విదేశాల నుంచి భారీ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే.  ఏపీ ఐటి మంత్రి నారా లోకేష్ పరిశ్రమలపై దృష్టి సారిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో సుమారుగా రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సన్నీ ఓపోటెక్‌ టెక్నాలజీ కంపెనీ ముందుకు వచ్చింది. మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో  సన్నీ ఓపోటెక్‌, ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్స్‌ శాఖ మధ్య ఒప్పందం జరిగింది.   


చైనాకి చెందిన మల్టీ నేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ సన్నీ ఓపోటెక్‌ టెక్నాలజీ కెమెరా మాడ్యూల్స్‌, ఆప్టికల్‌ కాంపొనెంట్స్‌ తయారీలో ఖ్యాతి గడించింది. రూ.500 కోట్ల పెట్టుడితో రాష్ట్రంలో 4000మందికి ఉపాధి కల్పించే అవకాశముంది. హువాయ్, జియోమీ, ఒప్పో, వివో, లెనోవో, సోనీ, పానాసోనిక్‌, ఒలంపస్‌, కార్ల్‌జిస్‌ లాంటి కంపెనీలకు ఆప్టికల్‌ కాంపొనెంట్స్‌ను సన్నీ ఓపోటెక్‌ తయారుచేస్తుంది. 


సన్నీ ఓపోటెక్‌, ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్స్‌ శాఖ మధ్య జరిగిన ఒప్పందం సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ నేడు దేశంలో పది ఫోనులు తయారు అవుతుంటే అందులో 3 రాష్ట్రంలోనే తయారవుతున్నాయని అన్నారు.  మొబైల్‌ఫోన్లు, టీచింగ్‌ సపోర్ట్‌, లైఫ్‌సైన్స్‌, ఆప్టికల్‌ ఇమేజింగ్‌ ప్రొడక్ట్స్‌, ఆటోమోటివ్‌ ఆప్టికల్‌ సర్వీసెస్‌ను సన్నీ ఓపోటెక్‌ అందిస్తుంది. కాగా,  2014లో ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఫోన్‌ కూడా తయారయ్యేది కాదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: