తొలుత సీపీఐ పార్టీ అనుబంధ న్యూస్‌ ఛానెల్‌ గా ఆవిర్భవించి,

తర్వాత జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్‌ ఆధీనంలోకి వెళ్లిన టీవీ99 ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. 


తోటచంద్రశేఖర్‌ ప్రభుత్వ సర్వీసుల నుంచి రిటైరైన తర్వాత.. 2009లో ప్రజారాజ్యం తరుపున గుంటూరు ఎంపీగా పోటీచేసిన తోట చంద్రశేఖర్‌, మళ్లీ 2014లో వైసీపీ లో చేరి తాడేపల్లి గూడెం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి మళ్లి జనసేనలోకి వచ్చేశారు.

 టీవీ ఛానెళ్లలో తనకు ప్రచారం తక్కువ అవుతున్నదని పవన్‌ కల్యాణ్‌ వాపోతున్నప్పుడు 99 న్యూస్‌ ఛానెల్‌ ను ఆయన కొనుగోలు చేసి... పవన్‌ ప్రచారాలకు అంకితం చేశారు. జనసేన అనుకూల సోషల్‌ మీడియా ప్రచారం నిర్వహించే బ ందాలన్నిటినీ ఆయనే పోషించారంటారు.


 ఎన్నికల్లో సీన్‌ రివర్స్‌ అవ్వడంతో , ఇప్పుడు 99 ఛానెల్‌ ఆయనకు గుదిబండగా మారింది. ఆయన దానిని వదిలించుకోవాలని చూస్తున్నారని సమాచారం.మొత్తానికి టీవీ 99 అతిస్వల్ప వ్యవధిలోనే అమ్మకానికి రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: