అదో ఫైనాన్స్ సంస్థ.. బంగారం కుదువ పెట్టుకుని రుణాలు ఇస్తుంది. అలా కుదువ పెట్టిన బంగారం చాలా జాగ్రత్తగా సేఫ్ రూముల్లో ఉంచుతారు. ఇంతలో పట్టపగలే దోపిడీ దొంగలు వచ్చారు. అచ్చం సినిమాల్లోలాగానే తుపాకీతో బెదిరించి ఏకంగా 55 కేజీల బంగారం ఎత్తుకెళ్లారు.

 

బీహార్ లోని హాజీపూర్ లో జరిగిందీ దారుణం. ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో పట్టపగలు సినీఫక్కీలో భారీ చోరీ జరిగింది. ఆయుధాలు ధరించి ముత్తూట్ ఫైనాన్స్ లోకి చొరబడిన దుండగులు 55 కేజీల బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ దారుణం మిట్ట మధ్యాహ్నం జరగడం విశేషం. 12.30కు చోరీ జరిగినట్లు సంస్థ సిబ్బంది తెలిపారు. మేనేజర్ ను తుపాకీతో బెదిరించారని పోలీసులు తెలిపారు.

 

మొత్తం ఆరునుంచి ఏడుమంది దుండగులు ఆయుధాలతో ముత్తూట్ పైనాన్స్ లోపలకి వెళ్లి ఈ పని కానిచ్చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరి ఈ దొంగలు దొరుకుతారో లేదో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: