ఇన్ని రోజులు స్థబ్ధుగా ఉన్న టెలికాం సంస్ధలు ఇప్పుడు మొబైల్ యూజర్స్ కి చుక్కలు చూపించడానికి రెడీ అవుతున్నాయి.  ఇంత కాలం చౌకగా వచ్చిందని ఇంటన్నెట్ ని విచ్ఛల విడిగా వాడేసారు. ఇంకనుండి మీ జేబులకు చిల్లులు పడటం ఖాయం. సోమవారం అర్ధరాత్రి నుండి ఈ కొత్త ఫ్యాకేజ్ లు అమలులోకి రానున్నాయి.

 

అయితే ఒడాఫోన్, ఐడియా మొబైల్ కాల్, డేటా చార్జ్ లను పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించింది. అయితే ఈ పెంపు డిసెంబర్ మూడోతేదీ నుండి అమలు అవుతాయి. అలాగె ఎయిర్ టెల్ సంస్థకూడా ధరల పెంపుల పోటీపడుతుంది. డిసెంబర్ 3 తర్వాత కస్టమర్లు నెలకు కనీసం రూ.49 రీచార్జ్ చేయాల్సి ఉంటుందని వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ ప్రకటించాయి. రిలయన్స్ జియో కూడా ఈ నెల 6వ తేదీ నుంచి యూజర్స్ పై చార్జీల భారం వేయనుంది. 

 

ఇదిలా ఉంటే వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.50,922 కోట్ల నష్టాన్ని చవిచూసింది. చరిత్రలో ఏ భారతీయ కంపెనీకి ఇంత భారీ స్థాయిలో త్రైమాసిక నష్టం రాలేదు. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఎజిఆర్)పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బకాయిలు చెల్లించడానికి కేటాయించిన నిబంధన కారణంగా సంస్థకు ఈ నష్టం వాటిల్లింది. కాగా, టెలికాం రంగంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉందని, తగిన ఉపశమనం ఇవ్వడానికి కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ పరిశీలిస్తోందని ప్రభుత్వం ప్రకటించింది.

 

ప్రీ-పెయిడ్ మొబైల్ వినియోగదారుల చార్జీలు మంగళవారం నుంచి పెరుగుతాయని వొడాఫోన్, ఐడియా ప్రకటించింది. ఈ పెంపు 50 శాతం వరకు ఉంటుందని స్పష్టం చేసింది. ఆయా ప్లాన్ల ఆధారంగా ఈ పెంపు ఉంటుందని పేర్కొంది. ఈ పెంపు ఉంటుందని పేర్కొంది. ఏడాదంతా వర్తించే రూ.999 ప్లాన్ ధర దాదాపు 50% పెరుగుతుండగా, ఇకపై ఇది రూ.1,499కి లభించనున్నది. ఈ ప్లాన్ డాటా వినియోగ పరిమితి 12 జీబీ నుంచి 24 జీబీకి పెంచారుఎయిర్‌టెల్ కూడా నెలవారీ ప్లాన్ రూ.24 నుంచి ప్రారంభం అవుతుంది. డేటాతో కూడిన ప్లాన్ రూ.35 నుంచి ప్రారంభం అవుతోంది. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: