తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం మీద అదనపు ట్యాక్స్ విధిస్తూ జీవో జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం విధిస్తున్న ట్యాక్స్‌కు అదనంగా పన్ను విధించడం కూడా జరిగింది. ప్రభుత్వం  ఏయే మద్యం ధరలు ఎంత మేర ట్యాక్స్ విధిస్తారో తెలియచేస్తూ  జీవో జారీ చేయడం జరిగింది. ఈ పెరిగిన ధరలు 2019 డిసెంబర్ 6 నుంచి అమల్లోకి వస్తాయి అని అధికారులు తెలియ చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రాలో మద్యపాన నిరంతర కోసం జగన్ సర్కార్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. 

 

ఇక పెరిగిన మద్యం ధరల గురించి తెలుసుకుందామా మరి... వాటి వివరాలు ఇలా....

 

భారత్‌లో తయారు చేసిన విదేశీ మద్యం 60 ఎంఎల్, 90 ఎంఎల్ మీద రూ.30 
భారత్‌లో తయారు చేసిన  విదేశీ మద్యం 180 ఎంఎల్ మీద రూ.60
భారత్‌లో తయారు చేసిన విదేశీ మద్యం 375 ఎంఎల్ మీద రూ.120
భారత్‌లో తయారు చేసిన విదేశీ మద్యం 750 ఎంఎల్ మీద రూ.240 
భారత్‌లో తయారు చేసిన  విదేశీ మద్యం 2000 ఎంఎల్ మీద రూ.750 

 

ఇక విదేశీ మద్యం ధరలు ఇలా...

విదేశీ మద్యం 50 - 60 ఎంఎల్ మీద రూ.30
విదేశీ మద్యం 200 - 275 ఎంఎల్ మీద రూ.60
విదేశీ మద్యం 330 - 500 ఎంఎల్ మీద రూ.120
విదేశీ మద్యం 700 - 750 ఎంఎల్ మీద రూ.240
విదేశీ మద్యం 1500/2000 ఎంఎల్ మీద రూ.750 

 

ఇక బీర్ పై ధరలు పెంచడం జరిగింది. వాటి వివరాలు ఇలా..

బీర్ 330 ఎంఎల్ మీద రూ.30
బీర్ 500 ఎంఎల్ మీద రూ.30
బీర్ 650 ఎంఎల్ మీద రూ.60
బీర్ 30,000 ఎంఎల్ మీద రూ.3000
బీర్ 50,000 ఎంఎల్ మీద రూ.6000
రెడీ టు డ్రింక్ అన్నింటి మీద రూ.60 ట్యాక్స్

 

ఆంధ్రాలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్య నియంత్రణకు బాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మద్యం ధరలను భారీగా పెంచింది జగన్ సర్కార్. ఇంకా దీంతో పాటు అదనపు పన్నులు కూడా జోడి చేయడంతో మందు బాబులకు షాక్ ఇస్తుంది. ఇక బార్లలో కూడా మద్యం ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని అధికారులు వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: