ప్రముఖ టెలికాం సంస్థ ఐనా రిలయన్స్ జియో డిసెంబర్ 6న  తన ప్లాన్లను సవరించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే  ఆ సమయంలో జియోఫోన్ కు సంబంధించిన ప్లాన్లలో మాత్రం జియో ఎటువంటి మార్పులూ  లేవు.  వాటిలో ఎటువంటి మార్పులూ చేయనప్పటికీ అత్యంత చవకైన ప్లాన్ రూ.49 ప్లాన్ ను తొలగించడం జరిగింది. దీంతో ఇప్పుడు జియో ఫోన్ ప్లాన్లలో అత్యంత చవకైన ప్లాన్ రూ.75 ప్లాన్ గా మార్చారు సంస్థ వాళ్ళు.

 

 

ఇక కొన్ని వారాల క్రితం జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్లలో ప్రవేశపెట్టిన  ఈ రూ.75 ప్లాన్ కూడా ఒకటి చాల గమనించవలసిన విషయం. ఇంకా ఈ ప్లాన్ తో పాటు వివిధ లాభాలతో రూ.75, రూ.125, రూ.155, రూ.185 ప్లాన్లను కూడా జత చేయడం జరిగింది. సాధారణంగా జియో ఫోన్ ఉపయోగించే వారిలో ఎక్కువ మంది ఈ రూ.49 ప్లాన్ నే వాడుతారు. ఎందుకంటే ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే నెల మొత్తం ఉచితంగా ఏ నెట్ వర్క్ కు అయినా కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 1 జీబీ డేటా కూడా వస్తుంది. అయితే జియో ఐయూసీ చార్జీలను తీసుకువచ్చిన అనంతరం వీరు కూడా వేరే నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవాలంటే అదనపు చార్జీలను కట్టవలసిన  పరిస్థితి ఏర్పడింది.

 


ఇక మరో వైపు ఐయూసీ చార్జీలను తీసుకురావడం, టారిఫ్ లను పెంచడంతో ఇప్పటికే జియో మార్కెట్లో చాల ఇబ్బందులను ఎదురుకోవడం జరిగింది. దానికి తోడు ఇప్పుడు ఈ రూ.49 ప్లాన్ ను తొలగించడం వినియోగదారులకు జియోపై మరింత ఎదురు దెబ్బ పాడడం జరిగింది. ఇంకా  ఇంతకుముందు ప్లాన్లు అయిన రూ.99, రూ.153, రూ.297, రూ.594 వంటి రీచార్జ్ ప్లాన్లు ఇప్పటికీ అందుబాటులోనే ఉండడం చాల ముఖ్యమైన విషయం. కానీ ఇందులో మరో ట్విస్ట్ ఉంది రీచార్జ్ చేసుకున్నప్పటికీ వినియోగదారులు వేరే నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి ఐయూసీ రీచార్జ్ చేసుకోవాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: