ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరికి ఖర్చులు  బాగా  పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ కారణంతో ప్రతి ఒక్కరూ ఇంటికి తీసుకెళ్లే జీతం ఎక్కువగా ఉంటే బాగుంటుంది అని నుకుంటున్నారు. ఇలా చెయాలి అనుకున్న వారికీ  శుభవార్త. ఇలా చేసుకోవడానికి  మీకు ఒక ఆప్షన్  కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతోంది. పీఎఫ్ కటింగ్స్ తగ్గించుకొని ఇంటికి తీసుకొని వెళ్లే  వేతనాన్ని సులువుగా పెంచుకునే అవకాశం ఇవ్వబోతుంది.

 

ఇందుకు మోదీ సర్కార్ సామాజిక భద్రత కోడ్ బిల్లు 2019 రూపంలో ఈ వెసులుబాటులను ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకురావాలనే భావనలో ఉంది.  ఈ బిల్లుకు ఈ వారంలోనే పార్లమెంట్‌లో ఆమోదం కూడా వచ్చే  అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే  ఈ బిల్లుకు సంబంధించి కేంద్ర కేబినెట్ దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది.

 

ఇక కంపెనీల పీఎఫ్ కంట్రిబ్యూషన్ విషయానికి వస్తే 12 శాతంగానే ఉంటుంది. అయితే కేవలం ఉద్యోగుల వేతనం నుంచి కట్ అయ్యే పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను తగ్గించాలనే భావనలో ఉంది కేంద్ర ప్రభుత్వం.  ఇక ఉద్యోగి బేసిక్ వేతనం నుంచి 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్‌‌లో జమ అవుతుందనే సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా.

 


ఇక ముఖ్యంగా పీఎఫ్ కంట్రిబ్యూషన్ తక్కువ అయితే ఏమిఅవుతుందో  తెలుసుకుందామా మరి.. దేశంలో చాలా మంది రిటైర్మెంట్ కోసం ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులను జమ చేసుకుంటూ వస్తారు. కానీ ప్రస్తుతం ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ తగ్గితే పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇలా అవ్వడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 

 


అలాగే ఇంకో విషయం ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ తగ్గిపోవడం వల్ల అకౌంట్‌లో జమ అయిన మొత్తం కూడా భారీ స్థాయిలో తగ్గుతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వయసు ఉన్న వారు 60 ఏళ్లలో రిటైర్ అవుతారని అనుకోండి. వీరి మంత్లీ బేసిక్ శాలరీ రూ.30,000. ఇప్పుడు కంట్రిబ్యూషన్‌ను 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తే.. రిటైర్మెంట్ మొత్తం రూ.92 లక్షల నుంచి రూ.76 లక్షలకు భారీ స్థాయిలో తగ్గడం జరుగుతుంది. అంటే అక్షరాలా రూ.16 లక్షలు కోల్పోయినట్లే. ఇలా జరగకుండా ఉండాలంటే తగ్గిన జాగ్రతలు తీసుకోవడం చాల మంచిది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: