రోజుల్లో కొంచెం గుర్తింపు ఉన్న చిన్న ఉద్యోగం ఉన్నా సరే కస్టమర్లకు క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తున్నారు. వాళ్ళ స్థోమత గురించి సరిగ్గా ఆరాలు తీయకుండా…. వారు కట్టకపోతే ఇంకా మాకే అధిక వడ్డీ తమకే కలిసి వస్తుందని ఆశతో ప్రైవేట్ బ్యాంకులు అన్నీ ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డులు ఇష్టం వచ్చినట్లు ఇచ్చేస్తున్నారు. అయితే ఇవాల్టి రోజున క్రెడిట్ కార్డులు లేని వాళ్ళు తక్కువ కనిపిస్తున్నారు. కాకపోతే నగరాలతో పోలిస్తే పట్టణాలు, ఒక మేస్తారు ఊర్లలో క్రెడిట్ కార్డులు పెద్దగా కనిపించవు అనుకోండి.

 

అయితే క్రెడిట్ కార్డుల వల్ల ఆన్లైన్ లావాదేవీలు చాలా సులువుగా అయిపోతుందని పట్టణవాసులు అంతా ఆనందంగా ఉంటే మరొక పక్క వాటిని అడ్డంపెట్టుకుని ఆన్లైన్ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని ఎన్నో ముఠాలు హైటెక్ పరిజ్ఞానంతో డబ్బులు కాజేస్తున్నారు. అలాంటి వారికి చెక్ పెట్టే విధంగా ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. మనం డెబిట్ క్రెడిట్ కార్డులను ఆన్లైన్ తో పాటు ఇతర సేవలను చేస్తున్న కారణంగా అనేక మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మార్చి 16 నుంచి మీ కార్డులను అన్ని ఆన్లైన్ వ్యవహారాలకు ఉపయోగించుకునేందుకు సాధ్యం కాదని చెబుతున్నారు.

 

మీ వద్ద ఉన్న కార్డులను డొమెస్టిక్ లావాదేవీల కోసమే అనుమతిస్తారు. అంటే ఏటీఎం మరియు సూపర్ మార్కెట్లు, మాల్స్, హోటల్, రెస్టారెంట్ లలో వాణిజ్య సంస్థల వద్ద మాత్రమే అనుమతిస్తారు.

 

ఆన్ లైన్ తో పాటు.. అంతర్జాతీయ లావాదేవీలు చేయాలనుకునే వినియోగదారులు తప్పనిసరిగా బ్యాంకు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీని కారణంగా ఆన్ లైన్ లో కొనుగోళ్లు.. చెల్లింపులు జరిపే అవగాహన ఉన్న వారు మాత్రమే వీటి కోసం అనుమతి తీసుకుంటారు. కొత్త నిర్ణయంతో ఆన్ లైన్ మోసాల్ని సగానికి పైనే తగ్గించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: