బంగారు ప్రేమికులకు నిజంగా ఇది షాకింగ్ అని చెప్పొచ్చు. ఎందుకు, ఏమని ఆలోచిస్తున్నారా... ? అయితే ఇది ఒకసారి చదవండి. నిజానికి బంగారం ధర ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉంది అని అందరికి తెలిసిందే. దీనితో జనాలు బంగారం పేరు చెబుతుంటే భయపడుతున్నారు. దానిని కొనాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు ఏకంగా రూ.45000 సమీపంలో జరుగుతుంది.

 

 

ఇక అలాంటిది ఇప్పుడు బంగారం విలువ ముందు ముందు మరింత పెరగొచ్చని మార్కెట్ నిపుణులు బల్ల గుద్ది చెబుతున్నారు. అది కూడా ఎంతలా అంటే ఇప్పుడు ఉన్న రేట్ కి రెట్టింపు కావొచ్చని అంచనా వేస్తున్నారు వారు. దీనికి కారణం ఒకే ఒక్కటి అదేదో కాదు ... కరోనా వైరస్. ఇది ఎలా అనుకుంటున్నారా...?  ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు నెల చూపులు చూస్తున్నాయి. దీనితో బంగారానికి బాగా గిరాకీ పెరిగింది. నిజానికి బంగారం ఒక సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా చూస్తారు. ఇక అంతర్జాతీయ మార్కెట్ ‌లో వచ్చే సంవత్సర కాలంలో బంగారం ధర ఔన్స్ ‌కు 3,000 డాలర్లకు చేరుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా తెలిపింది. 

 


ఇక ఇది మనకు 10 గ్రాములకు దాదాపు రూ.74,000 అనమాట. అయితే ప్రస్తుతం బంగారం ధర 1700 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిజానికి ఇది ఇప్పటి వరకు ఉన్న గరిష్ట స్థాయి. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు సడలింపు విధానాలను కొనసాగించడంతో సహా బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేయవచ్చనే అంచనాలు బంగారం డిమాండ్ ‌కు అనుకులిస్తున్నాయని వారు చెబుతున్నారు. కాకపోతే బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపే అంశాలు ఎక్కువుగా కూడా ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: