భారత దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చింది. ఎవరైతే డెబిట్ కార్డును అప్లై చేసారో వారికి డెలివరీ ఆలస్యం కావొచ్చని తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు దీనికి కారణం అని తెలుస్తోంది. ఎందుకంటే లాక్ డౌన్ వల్ల రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోయిన విషయం అందరికి తెలిసిందే....

 

 

ఇక ఈ కరోనా వైరస్ వాళ్ళ వచ్చిన లాక్ డౌన్ నిబంధనల వల్ల నెలకొన్న పలు పరిస్థితుల దృష్ట్యా డెబిట్ కార్డ్స్ డెలివరీ ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. నిజానికి ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని sbi తన వెబ్‌ సైట్‌ లో ఈ విషయాన్ని తెలిపింది. ఇక అలాగే ఇంట్లోనే ఉంటూ, సురక్షితంగా ఉండాలని sbi తన  ఖాతాదారులకు తెలిపింది. ఒకవేళ మీరు sbi కస్టమర్ అయ్యి ఉండి, కొత్త డెబిట్ కార్డు కోసం అప్లై చేసి ఉంటే మాత్రం.. మీరు కాస్త ఇంకొంచం ఎక్కువ కాలం ఆగాల్సి ఉంటుంది. ఇంకోవైపు బ్యాంకులు కూడా వారి కస్టమర్లకు సూచనలు చేస్తున్నాయి. అయితే ముక్యంగా డిజిటల్ బ్యాంకింగ్, ఆన్ ‌లైన్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని బ్యాంకులు చెబుతున్నాయి. మరి అంత అత్యవసరం అయితేనే బ్యాంక్ బ్రాంచ్ ‌కు రావాలని వారు చెబుతున్నారు.

 

అయితే బ్యాంకులు కరోనా వైరస్ నేపథ్యంలో వర్కింగ్ అవర్స్ ‌ను కాస్త మార్చేశాయి. అలాగే తక్కువ సిబ్బందితోనే బ్యాంకులు నడుపుతున్నాయి. బ్యాంక్ లో పనిచేసే ఉద్యగోలు కూడా ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య దూరాన్ని పాటిస్తున్నారు. అయితే మీరు కొత్త sbi డెబిట్ కార్డు కొరకు ఆన్ ‌లైన్ ‌లోనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందుకోసం నెట్ బ్యాంకింగ్ ‌లోకి లాగిన్ అయిన తర్వాత ఈ - సర్వీసెస్ ఆప్షన్ ‌ఎంచుకొని అందులో ATM కార్డు సర్వీసెస్ అని కనపడుతుంది. అందులో క్లిక్ చేస్తే ATM / డెబిట్ కార్డు కోసం రిక్వెస్ట్ ను మనం పెట్టుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: