ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది.  ఈ మహమ్మారి లాక్ డౌన్ కారణంతో ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నా సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. అంతేకాకుండా కొంతమంది తమ ఉద్యోగాలు కోల్పోయి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి కొందరు అయితే ఉద్యోగాలు ఉండి కూడా జీతాలు రాక అష్టకష్టాలు పడుతున్నారు అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది అని బాగా అర్థమవుతుంది. ఈ తరుణంలో ఉద్యోగులకు ఈపీఎఫ్ అకౌంట్ లో నుంచి డబ్బులు విత్ డ్రా  చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది.

 


వాస్తవానికి  కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పాండమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీ  ప్రవేశపెట్టడం జరిగింది. ఇక దీని ద్వారా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు వారి డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి అప్లై చేసుకోవచ్చు. ఇక గత పదిహేను రోజులలో 10.02 లక్షలు రూపాయలు ఉద్యోగులు విత్ డ్రా చేసుకోగా అందులో ఎక్కువగా 6.06 లక్షల డబ్బులు క్లెయిమ్ కేవలం కరోనా వైరస్ అడ్వాన్సు లే ఉండడం గమనించవలసిన విషయం. ఇక మొత్తానికి 15 రోజులలో ఈపీఎఫ్వో సంస్థ మొత్తం 3,600.85 కోట్ల రూపాయలు ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.

 


ఇది ఇలా ఉండగా మరోవైపు కార్మిక శాఖ అప్లికేషన్లు అన్నీ కూడా మూడు రోజుల్లోనే క్లైమ్ చేస్తున్నామని తెలియజేయడం జరిగింది. ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గారి కళ్యాణ యోజన మొదలు పెట్టిన సందర్భంగా ఉద్యోగులకు రెండు శుభవార్తలు ప్రకటించడం జరిగింది. అది ఏమిటి అన్న విషయానికి వస్తే ఈపీఎఫ్ అకౌంట్ లో బ్యాలెన్స్ లో 75% లేక మూడు నెలల బేసిక్ వేతనం ప్లస్ డి ఏ.. వీటిలో ఉద్యోగులకు ఏది నచ్చితే ఆ అమౌంట్ విత్ డ్రాచేసుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: