ఒకవైపు దేశం మొత్తం కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇంట్లోనే కూర్చొని అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు కొందరు. అయితే ఇక అసలు విషయానికి వస్తే... మూడు రోజుల క్రితం వచ్చిన అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు ఆన్లైన్ పూర్వకంగా ఒక రేంజ్ లో కొనుగోలు జరిగాయి. ఇక అసలు విషయానికి వస్తే...

 


ప్రముఖ డిజిటల్ సేవా సంస్థ ఫోన్ పే బంగారం కొనుగోలు, అమ్మకాలు కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఫోన్ పే కేవలం 24 క్యారెట్ల బంగారం మాత్రమే అందిస్తుంది. ఇక ఫోన్ పేలో బంగారం కొనుగోలు సాఫీగా జరిగేలా చూసుకునేందుకు తన వినియోగదారులకు బంగారం కొనుగోలు, అమ్మకాలకి వీలుగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లను చేసింది ఫోన్ పే.

 


అయితే ఈ విషయంపై వినియోగదారుల్లో స్పష్టత తెచ్చేందుకు బంగారం శుద్దీకరణ సంస్థలైన సేఫ్ గోల్డ్, ఎం ఎం టి సి, పిఏఎంపీలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. అయితే ఇక వినియోగదారులు కొనుగోలు చేసిన బంగారాన్ని బ్యాంకు స్థాయి భీమ కలిగిన లాకర్ సేవా కేంద్రంలో ఫ్రీగా నిల్వ చేస్తారు. అయితే ఈ సంవత్సరం అక్షయ తృతీయ విక్రయాలకు సన్నద్ధమయ్యే సమయంలో చాలామంది ఆన్లైన్ ద్వారా విక్రయాలను జరపాలని సూచించారు. దీనితో కొన్ని ఆఫర్లను ప్రకటించడంతో ఫోన్ పే లో బంగారు విక్రయాలు అసాధారణమైన రీతిలో జరిగాయి. నిజానికి ఇది ఎలా ఉంది అంటే గత సంవత్సరం పండగ సీజన్ తో పోలిస్తే ఈ సంవత్సరం అక్షయ తృతీయ బంగారు అమ్మకాలు ఏకంగా 125% పెరిగాయంట. ఇక ఇందులో లెక్కల విషయానికి వస్తే... జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వినియోగదారులు అత్యధిక బంగారాన్ని కొన్నారట. అయితే వినియోగదారుల సంఖ్య, అత్యధిక లావాదేవీల పరంగా చూస్తే పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలిచిందట. ఇక అలాగే హనుమకొండ, బంకురా, తిరుపతి, ముజఫర్, భిలాయ్ లాంటి కొన్ని మూడో తరగతి నగరాల నుంచి అత్యధిక స్థాయిలో లావాదేవీలు జరిగాయని తెలిపింది ఫోన్ పే సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి: