స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( sbi ) కస్టమర్ లకు మరోసారి గుడ్ న్యూస్ అని తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో కస్టమర్లను బ్యాంక్ ఆదుకోవడానికి భారతదేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన sbi రంగంలోకి దిగింది. అయితే ఇందుకుగాను sbi " ఎమర్జెన్సీ లోన్ స్కీమ్ " ను ప్రారంభించింది. ఇకపోతే ఇందులో కేవలం 45 నిమిషాల్లో రూ. 5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చును. ఇక అసలు విషయానికి వస్తే... కాస్త వడ్డీ కూడా తక్కువనే అని చెప్పవచ్చు. అది కూడా కేవలం 10.5% వడ్డీతో ఈ పర్సన్ లో లోన్ ఉన్న మనకు ఇవ్వబోతోంది sbi బ్యాంక్. ప్రస్తుతం ఏ ఇతర బ్యాంకుల వ్యక్తిగత రుణాల పై తీసుకుంటున్న వడ్డీతో ఇది పోలిస్తే చాలా తక్కువనే చెప్పవచ్చు.

 

 


అంతేకాదు ఈ లోన్ తీసుకుంటే ఈఎంఐ చెల్లించవలసిన అవసరం లేదు. అది కూడా ఆరు నెలల తర్వాత ఈఎంఐ మొదలవుతుంది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో అనేక పారిశ్రామిక ఇండస్ట్రీలు దెబ్బతిన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఉద్యోగాలు కూడా ఒకరకంగా ముప్పు ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే దేశంలో అనేక మంది వారి ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడిన సంగతి అందరికీ విదితమే. దీనితో ఇప్పుడు ఉద్యోగులు వ్యాపారస్తులు డబ్బు కోసం ఇబ్బందులు పడుతున్నారు. 

 

ఇక ఇలాంటి సమయంలో ప్రజలను ఆదుకోవడానికి sbi ఎమర్జెన్సీ లోన్ ప్రారంభించడం నిజంగా అభినందించదగ్గ విషయమే. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు అప్పు దొరకడం చాలా కష్టమైన విషయమే. అయితే ఇందుకుగాను పెద్ద చిక్కే పెట్టింది అని చెప్పవచ్చు. అదేమిటంటే మీకు మంచి క్రెడిట్ రికార్డు ఉంటే మాత్రమే ఈ లోన్ మొత్తాన్ని తీసుకోవచ్చు. కేవలం 45 నిమిషాల్లోనే ఈ ప్రాసెస్ పూర్తి అవ్వడంతోనే మీ అకౌంట్లో డబ్బులు జమ అయిపోతాయి. ఏది ఏమైనా తక్కువ వడ్డీతో sbi ప్రజల్ని ఆదుకోవడంలో ముందు అడుగు వేసింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: