నేడు మళ్లీ దేశీ స్టాక్ మార్కెట్స్ నష్టాల బాట పట్టింది. నేడు బెంచ్‌మార్క్ సూచీలు అన్ని కూడా నష్టపోయాయి. ఇంత దేశాల ప్రతికూల సంకేతాలు సహా హెవీవెయిట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు కొద్ది నష్టాల్లోనే ముగిశాయి. ఇక ఈరోజు ఇంట్రాడేలో సెన్సెక్స్ 663 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ కూడా 9050 పాయింట్ల కిందకు చేరుకుంది. ఇక చివరకు వచ్చేసరికి నష్టాలు కాస్త తగ్గాయి. నేటి నష్టాలకు మెటల్, FMCG, ఇంకా కొన్ని బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు. ఇకపోతే, BSE సెన్సెక్స్ 190 పాయింట్ల నష్టంతో 31,371 పాయింట్ల వద్ద, NSE నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 9197 పాయింట్ల వద్ద ముగిసాయి.

 


ఇక ఈరోజు మార్కెట్ విశేషాలు చూస్తే నిఫ్టీ 50లో వేదాంత, NTPC, ITC, భారతీ ఎయిర్‌టెల్, పవర్ గ్రిడ్ షేర్లు లబ్బల బాట పడ్డాయి. ఇందులో వేదాంత అమాంతం 12 % పైగా లాభాలు పొందింది. ఇక అదేసమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, GAIL, ఏసియన్ పెయింట్స్, సిప్లా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. ఇక ఇందులో రిలయన్స్ షేర్లు దాదాపు 6 % నష్టపోయింది.

 

ఇక నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌ లు కాస్త మిశ్రమంగా ముగిసాయి. ఇందులో నిఫ్టీ ఆటో, నిఫ్టీ FMCG, నిఫ్టీ IT, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ ‌లు లాభ పడగా, ఇక మిగతా ఇండెక్స్‌ లు అన్ని నష్టపోయాయి. ఇందులో నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ‌లు నష్టాల బాట పడ్డాయి. అలాగే అమెరికా డాలర్ ‌తో పోలిస్తే భారత్ రూపాయి కాస్త లాభాల్లో అనగా 23 పైసలు లాభంతో 75.50 వద్ద ట్రేడ్ అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: