మీకు కారు లేదు? చివరికి బైక్ కూడా లేదా ? అయితే మీకు కేంద్రం అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్తుంది. ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే?  కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ ని అందుబాటులోకి తీసుకురావాలి అని నిర్ణయం తీసుకుంది.. కేంద్ర రోడ్డ రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ఒక అడ్వైజరీని విడుదల చేసింది.

 

IHG's and Dont's - Budgetyatri ...

 

అదే.. రెంట్ ఏ మోటార్ క్యాబ్/సైకిల్. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం బైక్ లేదా కార్ ను రెంట్ స్కీమ్ ను తీసుకురానుంది. అంతే కాదు ఈ రెంట్ స్కీం అమలకు రోడ్డు మంత్రిత్వ శాఖ లైసెన్స్‌లు కూడా ఇవ్వాలి అని నిర్ణయించుకుంది. ఇంకా ఆపరేటర్లు ఈ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. అంతేకాదు వెహికల్ రెంట్ కు తీసుకెళ్లే వారికీ కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి అనేది రూల్. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే ఎవరికైన వెహికల్ ను అద్దెకు ఇస్తారు. అంతేకాదు ఇలా అద్దెకు ఇచ్చిన వెహికల్ కు ఏలాంటి స్టికర్లు ఉండవు. 

 

IHG

 

టూరిస్ట్‌లు, కార్పొరేట్ ఆఫీసర్లు, బిజినెస్ ట్రావెలర్స్, ఫ్యామిలీస్ వెకేషన్ కోసం సిటీకి వచ్చిన వారికీ ఈ స్కీమ్ కింద చాలా లాభాలు ఉంటాయి. ఇంకా ఈ స్కీమ్ ని కేంద్రం ప్రారంభిస్తే ఓలా, ఉబెర్ వంటి ట్యాక్సీ సర్వీసులకు పోటీ ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా ఈ నేపథ్యంలోనే పరిశ్రమ వర్గాలు, ఇతరుల నుంచి తీసుకున్న సలహాలు, సూచనల ప్రామాణికంగా ఈ అడ్వైజరీని జారీ చేసింది. మరి ఈ కొత్త పథకం ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: