ఇల్లు కొనాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ సామాన్యులకు అది సాధ్యం కాదు. ఎంతో కష్టపడితే తప్ప ఆ అవకాశం ఉండదు. అయితే సొంత ఇల్లుడు కొనుగోలు చేసేందుకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీం ద్వారా ప్రతి ఒక్కరి సొంత ఇల్లు ఉండాలి అనే లక్ష్యంతో స్కీమ్ ని ప్రారంభించారు. 

 

అయితే ఈ పథకం.. సబ్సిడీ లింక్ గృహ రుణ పథకం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనను ఒక సంవత్సరం పొడిగించాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2017 లో క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ తో కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఈ పథకంతో కేంద్ర ప్రభుత్వం రూ .2.30 లక్షల రుణ రాయితీని అందిస్తుంది. 

 

అయితే ఈ స్కిమ్ ప్రయోజనం పొందాలి అంటే వార్షిక ఆదాయం 6-18 లక్షల మధ్య ఉండాలి.. అప్పుడే ఈ స్కీమ్ ని పొందగలరు. ఇంకా ఇప్పుడు ఈ స్కీమ్ ని మార్చి 2021 వరకు పొందగలరు. ఈ కేంద్ర పథకం ద్వారా ఇప్పటివరకు 10 లక్షల మందికి లబ్ధి చేకూర్చినట్లు ఎస్బిఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే ఈ పథకంకు ఎలా దరఖాస్తు చేయాలంటే బ్యాంకుల్లో హోమ్ లోన్ కోసం అప్లై చేసినప్పుడే ప్రభుత్వ సబ్సిడీ అందించే దరఖాస్తు కూడా చెప్పాలి. మీరు అర్హులు అయితే సబ్సిడీ పొందగలరు. 

 

మీ దరఖాస్తు ఆమోదించబడితే, నోడల్ ఏజెన్సీ సబ్సిడీ మొత్తాన్ని బ్యాంకుకు పంపుతుంది. ఇంకా అప్పుడు మీ ఖాతాలో ఆ డబ్బు అంత జమ అవుతుంది. ఇది మీ మొత్తం రుణ మొత్తాన్ని తగ్గిస్తుంది. 6 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి 2.67 లక్షలు, 12 లక్షల ఆదాయం ఉన్నవారికి 2.35 లక్షలు, 18 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి 2.30 లక్షలు సబ్సిడీ అందుతుంది.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: