ఈ ఈవెంట్లో అక్కడ విద్యార్థులు సైతం శ్రీలీల ను ఉద్దేశిస్తూ లేడీస్ సూపర్ స్టార్ అంటూ నినాదాలు చేయగా, ఈ విషయం పైన శ్రీ లీల సున్నితంగానే ఆ ట్యాగ్ తిరస్కరించింది. తనకు ఇష్టమైన నటి నయనతార గారు, ఆమే మాత్రమే అసలైన లేడీస్ సూపర్ స్టార్ అంటూ తెలియజేసింది ఆమె నాకు రోల్ మోడల్.. తాను ఆ స్థాయిలో చేరుకోవడానికి చాలా సమయమే పడుతుందంటూ తెలియజేసింది శ్రీలీల. అలాగే వేదిక పైన తన పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
చెన్నై కుర్రాళ్ళు చాలా స్వీట్ ఇక్కడ దోస అంటే నాకు చాలా ఇష్టమని, నయనతార గారి లాగా తాను కూడా చెన్నైలోనే వివాహం చేసుకుంటానని అయితే అది ఎప్పుడు అనే విషయం చెప్పలేనంటు నవ్వుతూ తెలియజేసింది శ్రీలీల. దీంతో ఈ వ్యాఖ్యలకు సైతం పలువురు నెటిజెన్స్ శ్రీ లీల తమిళనాడుకు కోడలిగా వెళ్లబోతోందా? లేకపోతే ఎవరినైనా ప్రేమిస్తోందా అంటూ పలువురు నేటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీ లీల, ధనుష్ తో ఒక సినిమా బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్ తో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం పెళ్లి విషయంపై శ్రీలీల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి