దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ముగిశాయి. నేడు స్టాక్ మార్కెట్లో భారీ లాభాల్లో మొదలైన అప్పటికి తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఉదయం పూట భారీగా కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు మధ్యాహ్నం నుండి లాభాలను స్వీకరణతో స్టాక్ మార్కెట్ మళ్లీ దిగువకు పడిపోయింది. ఇక అలాగే నేడు మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ కేవలం 24 పాయింట్లు లాభపడి 37, 663 వద్ద ముగిసింది. ఇక దేశీయ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 6 పాయింట్లు లాభపడి 11, 101 వద్ద ముగిసింది.


ఇక నేటి నిఫ్టీ యాభైలో లాభాల, నష్టాల  విషయానికి వస్తే హిండాల్కో, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐచర్ మోటార్స్, అధాని పోర్ట్స్ టాప్ గైనర్స్ గా నిలిచాయి. ఇక మరోవైపు యుపిఎల్, హెచ్డిఎఫ్సి లైఫ్, పవర్ గ్రిడ్ కార్ప్, రిలయన్స్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ షేర్లు నష్టాల బాటలో నడిచాయి. ఇక ఇందులో టాటా స్టీల్, యు పి ఎల్ అత్యధికంగా నష్టపోయింది.


ఇక మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో భారత్ రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే పదకొండు పైసలు లాభపడి 75.04 వద్ద ముగిసింది. నేడు ఈక్విటీ మార్కెట్లో సానుకూల ధోరణి, అమెరికా కరెన్సీ బలహీనపడటం,ఫారం ఫండ్ ఇంట్లో మొదలగు కారణాల తో రూపాయి బలపడింది. ఇక తాజాగా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు మార్కెట్ నుండి ఏడు వందల మూడు కోట్లకు పైగా షేర్లను కొనుగోలు చేశారు. ఇక నేడు నిఫ్టీ ఇండెక్స్ లలో ఆటో రెండు శాతం, మెటల్ ఇండెక్స్  4%, మీడియా ఒక శాతం పైగా లాభపడింది. అలాగే నిఫ్టీ ఫార్మా 0.3 శాతం నష్టపోయింది. నేడు దేశీ స్టాక్ మార్కెట్లు తీవ్ర వత్తిడిలోనే చివరికి ఫ్లాట్ గా ముగిసింది. ఒకానొక సమయంలో 400 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ చివరికి 24 పాయింట్ల లాభంలో ముగిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: