గత రెండు రోజుల లాభాలను కొనసాగిస్తూ నేడు కూడా స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్ నేడు ఉదయం మొదలైన సమయంలో కాస్త బాగానే పెరుగుతున్న సమయంలో అంతర్జాతీయ కారణాల ద్వారా చివరకు స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకుంది. మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ 86 పాయింట్లు బలపడి 38, 615 వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 23 పాయింట్లు బలపడి 11,408 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్ లో ప్రోత్సాహం, అలాగే దేశీయంగా కొన్ని సెంటిమెంట్ కారణాల నేపథ్యంలో వరుసగా మూడో రోజు కూడా స్టాక్ మార్కెట్లు లాభాలలో ముగిసింది. ఇక నేడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి లో మీడియా రంగం ఏకంగా ఐదు శాతం పైగా బలపడగా , పీఎస్యూ బ్యాంక్ 2 శాతం పైగా లాభపడ్డాయి.



ఇక నేడు నిఫ్టీ 50 లో లాభనష్టాల విషయానికి వస్తే... జి ఎంటర్టైన్మెంట్, గేయిల్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, మారుతి సుజుకి కంపెనీలు అత్యధికంగా లాభపడిన షేర్లలో ముందుగా ఉన్నాయి. ఇందులో జి ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఏకంగా 13 శాతం పైగా లాభపడింది. ఇక మరోవైపు బజాజ్ ఆటో, ఓఎన్ జిసి, నెస్లే, కోల్ ఇండియా, విప్రో కంపెనీల షేర్లు అత్యధికంగా నష్టపోయినా లిస్టులో మొదటగా ఉన్నాయి. ఇందులో అత్యధికంగా బజాజ్ ఆటో 1.45 శాతం నష్టపోయింది.


ఇక మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు చూస్తే... మనదేశంలో గత రెండు రోజుల్లో బంగారం ధర రూ. 1500 రూపాయలు పెరిగి, మరోవైపు రెండు వేల రూపాయలు పెరిగింది. అయితే నేడు మాత్రం కాస్త బంగారం ధర తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 411 రూపాయలు నష్టపోయి 53160 వేలకు చేరుకుంది. అలాగే వెండి కూడా 1900 రూపాయలు తగ్గి కేజీ వెండి 65,610 చేరుకుంది. ఇక నేడు హైదరాబాదులో బంగారం విషయానికి వస్తే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 120 రూపాయలు తగ్గి 56240 కి చేరుకుంది. కేజీ వెండి ధర రూ.3000 తగ్గి రూ. 68,100 కు చేరుకుంది

మరింత సమాచారం తెలుసుకోండి: