దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఇక ఉద్యోగం కోల్పోయిన వారికి ఊరట కలిగించే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇక వారికీ సగం జీతం అందజేస్తామని తెలిపారు. అయితే ఈ ప్రయోజనం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండదని వెల్లడించారు. కేవలం కొందరికి మాత్రమే ఈ ఊటర లభిస్తుందని నిపుణులు తెలిపారు. ఇక ఈఎస్ఐసీ స్కీమ్‌లో ఉన్న వారికే ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుందని అన్నారు.

ఇక మోదీ సర్కార్ అటల్ బిమిత్ వ్యక్తి కల్యాణ్ యోజనలో భాగంగా.. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద కోవిడ్ 19 కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి మాత్రమే ఈ సగం జీతం రూల్ వర్తింపజేస్తోందని నిపుణులు తెలియజేశారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈఎస్ఐసీ స్కీమ్‌లో ఉన్న వారికే ఈ బెనిఫిట్ లభిస్తుందని నిపుణులు తెలిపారు. కేంద్ర కార్మిక శాఖ తాజాగా ఈ రూల్స్‌ను నోటిఫై చేసిందని అన్నారు.

అంతేకాకుండా 2020 డిసెంబర్ 31 వరకు ఉద్యోగులకు జాబ్ పోతే సగం వేతనం అందుతుందని అన్నారు. అయితే అటల్ బిమిత్ కల్యాణ్ యోజన మాత్రం వచ్చే ఏడాది జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఉద్యోగం పోయిన దగ్గరి నుంచి గరిష్టంగా 90 రోజుల వరకు సగం వేతనాన్ని అందిస్తారు. ఈలోపు మరో కొత్త జాబ్ వెత్తుకోవలసి ఉంటుంది. అప్పుడు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చునని నిపుణులు తెలిపారు.

ఇక ఉద్యోగం కోల్పోయిన వారికి గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు 30 రోజులలోగా డబ్బులు అందుతాయన్నారు. గతంలో ఉద్యోగం పోయిన 90 రోజుల తర్వాత డబ్బులు లభించేవి. ఈఎస్ఐ స్కీమ్‌లో ఉన్న వారు ఉద్యోగం పోతే నేరుగా ఆన్‌లైన్‌లోనే క్లెయిమ్ అందజేయవచ్చునన్నారు. డబ్బులు డైరెక్ట్‌గా బ్యాంక్ ఖాతాకు వచ్చి చేరతాయని తెలిపారు. అయితే ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగులు సగం వేతనం పొందాలంటే కనీసం 2 ఏళ్లు ఈఎస్ఐసీ సభ్యులుగా ఉండాలి. బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి అని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: