ప్రస్తుతం కాలంలో అందరూ ఆన్ లైన్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాటి వల్ల ఒక్కో సారి క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా వస్తుండటంతో వినియోగ దారులు ఇటువంటి వాటిని ఉపయోగిస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే , పేటీఎం వంటి యాప్ ల ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఈ మేరకు పేటీఎం వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్ ను అందజేసింది. పేటీఎం ద్వారా ఆన్ లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే అద్భుతమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా వస్తాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.



పేటీఎం వినియోగ దారులకు మాత్రం అదిరిపోయే శుభవార్తను అందించింది. మొబైల్ వాలెట్ కంపెనీ పేటీఎం తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఆ చార్జీలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పేటీఎం వాడే వారికి బెనిఫిట్ కలుగనుంది. పేటీఎం సాధారణంగా వాలెట్‌లోని డబ్బులను బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని భావిస్తే.. చార్జీలు వసూలు చేసేది. అయితే ఇప్పుడు ఈ చార్జీలను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.. ఈ యాప్ ద్వారా ఎన్నో వేల మంది డిజిటల్ లావాదేవీలను చేస్తున్నారు. అందుకే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.




అదనపు చార్జీలను తొలగించడం వల్ల ప్రజలకు కొంతవరకు ఊరట కలుగుతుంది అని పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ ఈ విషయాన్ని ఆన్‌లైన్ వేదికగా చెప్పుకొచ్చారు.పేటీఎం వాలెట్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు మీరు విధించే 5 శాతం ఫీజు‌ను తొలగిస్తే ఏమౌతుందని పేటీఎం యూజర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు విజయ్ శేఖర్ శర్మ సమాధానమిచ్చారు.. ఈ నేపథ్యంలో అదనపు చార్జీలను తొలగించాలని అనుకున్నట్లు తెలిపారు.  ఇకపోతే క్రెడిట్ కార్డు నుంచి పేటీఎం వాలెట్‌కు డబ్బులు పంపించుకోవాలని భావిస్తే మాత్రం చార్జీలు చెల్లించుకోవాలి. 2 శాతం ఫీజు పడుతుంది. ఉదాహరణకు మీరు క్రెడిట్ కార్డు నుంచి రూ.100 పేటీఎంకు యాడ్ చేసుకుంటే మీ క్రెడిట్ కార్డు నుంచి రెండు రూపాయలు చార్జీ చేయబడతాయి అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: