టాలీవుడ్, కొలీవుడ్లో పలు చిత్రాలలో చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్గా నటించిన సక్సెస్ కాలేకపోయి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాలలో నటిస్తోంది నటి ఊర్వశి. ఈమె ఇప్పటి వరకు 300 కు పైగా చిత్రాలలో నటించింది. తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ కెరియర్ పరంగా ఎలాంటి డోకా లేకుండా ముందుకు వెళ్తోంది ఊర్వశి. నటి ఊర్వశి జీవితంలో ఎదురైన కొన్ని జీవిత కష్టాలను ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.


2000 సంవత్సరంలో నటుడు మనోజ్ ను వివాహం చేసుకున్న ఈమె తేజలక్ష్మి అనే కూతురు జన్మించింది. ఆ తర్వాత కొన్ని కారణాల చేత వీరిద్దరూ 2008లో విడాకులు తీసుకున్నారు. మళ్లీ 2013లో శివప్రసాద్ ను వివాహం చేసుకోగా వీరికి ఒక కుమారుడు కూడా జన్మించారు. తన మొదటి వివాహం ఎందుకు ఫెయిల్ అయిందని విషయాన్ని ఊర్వశి పంచుకుంది. మొదటిసారి పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టినప్పుడు తనకి అక్కడ వాతావరణం చాలా డిఫరెంట్ గా అనిపించిందని, ఇంట్లో అందరూ కలిసి తాగడం ,తినడం చేయడం వల్ల తాను ఆ వాతావరణానికి అడ్జస్ట్ కావడానికి చాలా ప్రయత్నించాను.


కానీ చివరికి వారి పద్ధతులు నేర్చుకున్నాను, సినిమా షూటింగ్ నుంచి రాగానే మందు కొట్టడం అలవాటుగా మారి క్రమంగా వ్యాసనంగా మారిపోయిందని తెలియజేసింది. అయితే అప్పటికి ఇంటి బాధ్యతలు తన భుజాల పైన పడటంతో ఇష్టం లేని పనులను కూడా కొన్నిసార్లు చేయవలసి వచ్చిందని, దీంతో తన అభిప్రాయాలు ఎవరికీ నచ్చకపోవడం గొడవలు జరగడం కోపంతో మరింత ఎక్కువగా మద్యం తాగేదాన్ని , అలా తిండి నిద్ర మానేసి రాత్రి అయితే చాలు తాగి తన ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నానని.. ఈ విషయాన్ని గమనించిన ఊర్వశి స్నేహితులు, తన పర్సనల్ స్టాప్ తనని పూర్తిగా మద్యం నుంచి బయటపడేలా చేశారని వారి వల్లే ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: