ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు మాత్రం చాలా అవసరం.. ఇటీవల కాలంలో కరోనా ప్రభావం వల్ల చాలా ఇబ్బందుల ను ఎదుర్కొంటున్నారు.. దాదాపు ఏడు నెలలు ఎటువంటి పనులు లేక పోవడం తో ప్రజలు నానా ఇబ్బందులు చవి చూస్తున్నారు. ప్రజలను అన్నీ విధాలుగా ఆదుకోవడానికి కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నారు. ఎస్బిఐ వంటి తదితర బ్యాంకులు ప్రజలను ఆకర్షించడానికి వడ్డీ రేట్లను పూర్తిగా తగ్గిస్తున్నారు.. ఈ మేరకు గోల్డ్ పై లోన్ ఇచ్చేవాళ్ళు కూడా సరికొత్త ఆఫర్లను అందిస్తున్నారు..




తాజాగా ముత్తూట్ ఫైనాన్స్ కస్టమర్లకు సరికొత్త ఆఫర్లను అందుబాటు లోకి తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.. కొత్త సర్వీసులు అందుబాటు లోకి తీసుకువచ్చింది. బంగారు ఆభరణాలకు ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తోంది. దీని కోసం ముత్తూట్ ఫైనాన్స్.. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ముత్తూట్ ఫైనాన్స్ కొత్త ఇన్సూరెన్స్ సేవలను ముత్తూట్ గోల్డ్ షీల్డ్ పేరు తో కస్టమర్లకు అందించనుంది. దీన్ని ఎవరైనా తీసుకోవచ్చు. అయితే ముత్తూట్ ఫైనాన్స్ కస్టమర్ అయ్యి ఉండాలి. అంటే మీరు ముత్తూట్ ఫైనాన్స్ ‌లో గోల్డ్ లోన్ తీసుకొని ఉంటారు.




ముత్తూట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ మాట్లాడుతూ.. కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్ ‌‌లో భాగంగా అలాగే సామాజిక బాధ్యత కింద తాము కస్టమర్లకు ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తున్నామని తెలిపారు.దోపిడీ, దొంగతనం సహా 13 రకాల ఇతర విపత్తుల కారణంగా బంగారం పోతే అప్పుడు ఈ పాలసీ కవరేజ్ వర్తిస్తుంది. ముథూట్ గోల్డ్ షీల్డ్ పాలసీ తీసుకుంటే ప్రీమియం కూడా నామమాత్రంగానే ఉంటుంది.. జీరో డాక్యుమెంటేషన్ ద్వారా కేవలం 2 నిమిషాల్లో నే ఈ పాలసినీ కూడా తీసుకోవచ్చు.. మొత్తానికి లోన్ తీసుకునే వారు సంఖ్య పెరుగుతూ వస్తున్నారు. ఈ సేల్స్ కూడా ఈ దెబ్బతో పెరుగుతున్నాయని కంపెనీ వెల్లడించింది..


మరింత సమాచారం తెలుసుకోండి: