హీరో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ నుపుర్ సనన్. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో తెలుగులో ఎక్కువగా అవకాశాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లో నుపుర్ సనన్ అడపా దడపా సినిమాలలో నటిస్తూ హీరోయిన్గా రానిస్తోంది. నుపుర్ సనన్ ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్గా పేరు సంపాదించిన కృతి సనన్ సొంత చెల్లెలు కావడం గమనార్హం. త్వరలోనే నుపుర్ సనన్ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది వారి గురించి తెలుసుకుందాం.


తాజాగా నుపుర్ సనన్ సోషల్ మీడియా వేదికగా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలను సైతం షేర్ చేయగా వీటిని చూసి అభిమానులు, సిని సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఫోటోలకు క్యాప్షన్ ని జోడిస్తూ.. "బహుశాలతో నిండిన ప్రపంచంలో, నేను నా సోల్ ని కనుక్కొన్నాను అంటూ జోడించింది" . వీరి ఎంగేజ్మెంట్ కేవలం స్నేహితుల సమక్షంలో మాత్రమే జరుపుకున్నట్టుగా కనిపిస్తోంది. నుపుర్ సనన్  గడిచిన మూడు సంవత్సరాల నుంచి ప్రముఖ సింగర్ స్టేబీన్ బిన్ తో ప్రేమలో ఉన్నది.


ఇప్పుడు తాజాగా ఈ జంట తమ ప్రేమ విషయాన్ని సైతం పెళ్లి వరకు తీసుకువెళ్లడానికి మరో ముందడుగు వేసినట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా జనవరి 11వ తేదీన రాజస్థాన్లోని ఉదయపూర్ లో వీరి వివాహం చాలా గ్రాండ్గా కుటుంబ సభ్యులు ,సన్నిహితుల సమక్షంలో జరగబోతున్నట్లు వినిపిస్తున్నాయి. వివాహ మాత్రం ముంబైలో చాలా గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ఈ రోజు కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ విషయంపై హీరోయిన్
నుపుర్ సనన్ కానీ, కృతి సనన్ కాని ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి మరి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: