కరోనా సంక్షోభం అనేక రంగాలలో పెను మార్పులకు దారితీసింది. ఉత్పత్తి రంగాన్ని కుదేలు చేసింది. పలు సంస్థలు దేశాన్ని వీడిపోతుండటం చూస్తూనే ఉన్నాం. దీనితో ఆయా రంగాలలో స్వయంగా ఉత్పత్తి కోసం భారత్ ప్రయత్నిస్తుంది. సేవ రంగంలో కరోనా కారణంగా అభివృద్ధి జరిగిందనే చెప్పాల్సి వస్తుంది. ఇక ఎంటర్ టైన్మెంట్ రంగం అయితే కొత్త పుంతలు తొక్కినప్పటికీ ఒక వర్గం మాత్రం తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. మొత్తానికి అనేక రంగాలు ఈ సంక్షోభం వలన నేల చూపులు చూస్తుంటే ఒక్క వైద్య రంగం మాత్రం కాస్త పరవాలేదు అన్నట్టుగా ఉండిపోయింది.

టీవీ, సినిమా పరిశ్రమల సంగతి కూడా దాదాపుగా అంతే ఉంది. ఈ రంగాలలో పని ఉంటె తిండి లేదంటే లేని వారే ఎక్కువ ఉంటారు. ఎవరో స్టార్ హోదా లో ఉన్నవారికి తప్ప మిగిలిన వారందరూ ఇదే పరిస్థితికి చెందిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇక పెద్ద పెద్ద సంస్థల విషయానికి వస్తే పెట్టుబడి పెట్టి కొత్త కొత్త కార్యక్రమాలు రూపొందించి తమ ఉనికిని నిలబెట్టుకున్నాయనే చెప్పాలి. సినిమాలకు ఓటిటి లాంటి ప్రత్యామ్నాయం దొరకడం కాస్త మేలు జరిగినట్టే అంటున్నారు ఆ వర్గం నిపుణులు. టీవీ రంగంలో కూడా ఈ పరిస్థితి కాస్త ఉందనే చెప్పాలి. ఒక్కసారిగా కార్యక్రమాలు రూపొందించడంలో ఆలస్యం అయితే ప్రేక్షకులు మరో ఛానల్ మార్చేస్తారు కాబట్టి వీళ్లు ఎన్ని సాధకబాధకాలు ఉన్నప్పటికీ వారి సొంత వీక్షకులను కోల్పోకుండా చూసుకోవడం చాలా అవసరం.

ఇప్పటికే టీవీ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన జీ ఎంటర్టైన్మెంట్స్ తన వాటా ను సోనీ కి అమ్మేయడానికి సిద్దపడింది. సాధారణంగా ఇలాంటివి రెండు కారణాలతో జరుగుతుంటాయి. ఒకటి కొత్త పెట్టుబడుల కోసం, రెండు మరో పెద్ద సంస్థ చేతికి వెళితే వచ్చే ఆదరణ కలిసి వస్తుందని. ఏది ఏమైనా జీ 47.07 శాతం వాటాను మాత్రం ఉంచేసుకొని మిగిలినది సోనీకి అప్పగించేస్తుంది. దీనివలన 1.575 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుంది. ఈ ఒప్పందం ప్రకారం జీ సీఈఓ సహా పలు అధికారులు మరో మూడేళ్లు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జీ ఎంటర్టైనర్ గా మంచి కంటెంట్ తో పేరు తెచ్చుకోగా, క్రీడా రంగంలో సోనీ పేరు తెచ్చుకుంది. ఈ రెండు కలిస్తే, దక్షిణ ఆసియాలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసి ప్రేక్షకుల మన్ననలు పొందగలవనేది తాజా అంచనా. ఈ విలీనం అనంతరం బోర్డు సభ్యుల ను నిర్ణయించే అధికారం సోనీకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: