మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందా? కొత్తగా సిలిండర్ బుక్ చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు ఓ చక్కటి శుభవార్త. ఎందుకంటే ఇప్పుడు మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందబాటులోకి వచ్చాయి. ఇందులో మీరు భారీ తగ్గింపుని సొంతం చేసుకోవచ్చు. అయితే ఇంకెందుకు ఆలస్యం ఏ ఏ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.ఫ్లిప్‌కార్ట్ ద్వారా  సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఇలా సిలిండర్ బుక్ చేసుకుంటే సులభంగా తగ్గింపు పొందొచ్చు. అయితే మీకు సూపర్ కాయిన్లు అనేవి ఉండాలి. వీటి ద్వారా మీరు సిలిండర్ ని బుక్ చేసుకోవచ్చు.ఉదాహరణకు మీ దగ్గర ఒక 160 సూపర్ కాయిన్లు ఉంటే ఇప్పుడు మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని భావిస్తే.. మీకు ఖచ్చితంగా రూ. 40 తగ్గింపు వస్తుంది.


ఇలా మీకు ఎక్కువ సూపర్ కాయిన్లు ఉంటే.. అంత ఎక్కువ డిస్కౌంట్ అనేది మీకు లభిస్తుంది.ఇంకా అలాగే పేటీఎంలో కూడా సూపర్ ఆఫర్లు  ఉన్నాయి. రూ. 5 నుంచి రూ. 1000 దాకా మీరు తగ్గింపు పొందొచ్చు. ఫ్రీ గ్యాస్ ప్రోమో కోడ్ వాడితే 100 శాతం దాకా క్యాష్ బ్యాక్ పొందొచ్చు.అలాగే మీరు గ్యాస్ 1000 ప్రోమో కోడ్ వాడితే .. మీకు రూ. 1000 దాకా క్యాష్ బ్యాక్ వస్తుంది.ఇంకా అలాగే మీరు అమెజాన్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా తగ్గింపు లభిస్తోంది. ఐసీఐసీఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డు ద్వారా సిలిండర్ ని బుక్ చేసుకుంటే మీకు 2 శాతం క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంది. ఇంకా అలాగే స్క్రాచ్ కార్డులు పొందొచ్చు. వీటిల్లో చాలా ఆఫర్లు ఉంటాయి.ఇంకా అలాగే ఎయిర్‌టెల్ కస్టమర్లు కూడా సిలిండర్ బుకింగ్‌పై తగ్గింపుని సొంతం చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ లో సిలిండర్ బుక్ చేసుకుంటే మీకు రూ. 20 తగ్గింపు లభిస్తోంది. అయితే పరిమిత కాల ఆఫర్ అని గుర్తించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: