ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు బంగారం. ఈ బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. రేటు ఎంత ఉన్నప్పటికీ మహిళలు ఈ బంగారాన్ని కొనేందుకు ఆసక్తి చూపుతారు. అయితే 2023లో బంగారానికి డిమాండ్ తగ్గిందా? పెరిగిందా? అని సూటిగా  ప్రశ్నిస్తే ప్రపంచ స్వర్ణ మండలి వార్షిక నివేదికలో కొన్ని హైలెట్ చేసిన పాయింట్లను గమనిస్తే.. మనకి కనిపించే సమాధానం..


తగ్గిందని ఇది నిజమా? అన్న ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే బంగారం మీద ప్రజల్లో మోజు తగ్గినట్లు కనిపించినా ఒక విభాగంలో తప్పించి మిగిలిన విభాగాల్లో డిమాండ్ బాగానే ఉంది. తాజాగా విడుదలైన నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022తో పోలిస్తే 2023లో బంగారం గిరాకీ మూడు శాతం తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఎందుకిలా? అన్న ప్రశ్నకు పలు రకాల కారణాలు కనిపిస్తాయి. తాజా నివేదిక ప్రకారం దేశీయంగా 747.5 టన్నుల బంగారానికి గిరాకీ లభించింది.


అంతకు ముందుతో పోలిస్తే మూడు శాతం తక్కువ. 2022లో బంగారం గిరాకీ 774.1 టన్నులు.  ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పసిడికి కాస్త గిరాకీ తగ్గినట్లుగా కనిపించింది. ఆభరణాల గిరాకీ కొంత తగ్గుమఖం పట్టింది. 2022లో 600.6టన్నుల ఉండగా.. 2023లో మాత్రం 562.3టన్నులు ఉంది. ఇదే సమయంలో పెట్టుబడులకు బంగారం సురక్షితం ఉనే విషయాన్ని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఈ కారణంగా 2002లో 173.6 టన్నుటు ఉంటే 2023లో 185.2 టన్నులకు పెరిగింది.


బార్లు నాణేలు పెట్టుబడులకు 2022లో 172 టన్నులు ఉంటే 2023లో 185 టన్నులుగా మారింది. మొత్తం బంగారం దిగుమతుల్లో 2022లో 650.7 టన్నులుగా ఉంటే 2023లో 780.7 టన్నులుగా ఉంది. ఆర్బీఐ కొనే బంగారంలోను 2022తో పోలిస్తే 2023 సగం తక్కువగా కొనుగోలు చేయడం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే దేశీయంగా బంగారం డిమాండ్ ఒక్క విభాగంలో తప్పించి.. మిగిలిన విభాగాల్లో అంతకుముందు  ఏడాది కంటే 2023లో ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ ఏడాది ఎలా ఉంటుందో చూడాలి?

మరింత సమాచారం తెలుసుకోండి: