కరోనా సమయంలో ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభంతో అల్లకల్లోలం అవుతుంటే భారత్ లో మాత్రం పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయి.  ఇతర దేశాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. మన దగ్గర పేద వాళ్లు ఆహారానికి ఇబ్బంది పడుతున్నారని కేంద్రం బియ్యం, పప్పులు ఉచితంగా అందించింది. కొన్ని చోట్ల పలువురు నిత్యావసరాలు స్వచ్ఛందంగా అందజేస్తూ సేవలు చేశారు. మధ్య తరగతి వారు మాత్రం కొంతమేర ఇబ్బంది పడ్డారు.


మన దేశంలో సగటు మధ్య తరగతి భారతీయుడు ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే.. రూపాయి సంపాదిస్తే  యాభై పైసలైనా పొదుపు చేయాలి. కనీసం 20-30 పైసలైనా దాస్తారు.  అది బంగారం పైన, లేక భూములపైన ఏదో ఒక దానిపై ఇన్వెస్ట్ చేస్తారు. ప్రస్తుతం ఉన్న యువతరానికి అయితే ఈ జాగ్రత్తలు అలవాట్లు రాలేదు కానీ.. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న 90s కిడ్స్ కి మాత్రం బాగా తెలుసు.


ప్రస్తుత యువతరం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతూ.. క్రెడిట్ కార్డుల అప్పులు చేస్తూ.. దాదాపు అప్పులు చేస్తూనే జీవితం గడిపేస్తున్నారు.  కానీ మన తల్లి దండ్రులు ఎంత జాగ్రత్త పరులో తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. మహిళా సమ్మాన్ నిధిలో ఏపీ దేశంలోనే టాప్ 5 లో చోటు సంపాదించుకుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే..


ఇందులో రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే.. ఏడాదికి ఏడున్నర శాతం వడ్దీ వస్తుంది. తొలి ఏడాదిలో అసలు మొత్తం మీద రూ.15 వేలు వడ్డీ వస్తుంది. రెండో ఏడాది రూ.16,125 వడ్డీ పొందుతారు. దీనికి దరఖాస్తు చేసుకొని ఏపీలో డబ్బులు పొందిన వారు 1,35,400 మంది. చిన్నపాటి లాభం వస్తున్నా సరే పెట్టుబడి పెడతారు అని చెప్పడానికి ఉదాహరణే ఇది. ఇక ఇందులో తొలి స్థానంలో మహారాష్ట్ర,  రెండో స్థానంలో తమిళనాడు, ఒడిశా మూడు, కర్ణాటక నాలుగో స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానం ఏపీది.

మరింత సమాచారం తెలుసుకోండి: