ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు స్మార్ట్ఫోన్లు కేవలం కొంతమంది దగ్గర మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ఇక స్కూల్ కి వెళ్ళే పిల్లలు సైతం స్మార్ట్ఫోన్లు వాడుతూ ఉండడం గమనార్హం.. అంతేకాదు ఇక సోషల్ మీడియాలో గంటల తరబడి కాలం గడిపేస్తున్నారు. టెక్నాలజీ  ఉపయోగించుకుని ఆన్లైన్ మెసేజింగ్ యాప్ ద్వారా ఎక్కడో ఉన్న స్నేహితులకు సైతం మెసేజ్ లు పెడుతున్నారు. ఇలా ఇటీవల కాలంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న ఆన్లైన్ మెసేజింగ్ యాప్ ఏది అంటే అందరు టక్కున చెప్పేస్తారు వాట్సప్ అని.


 ఇక వాట్సాప్  వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది.ఇక ఈ మెసేజ్ యాప్ లో ఎప్పుడూ సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఇక వాట్సాప్ వాడే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మాట్లాడాలి అనిపిస్తే వాట్సాప్లో మెసేజ్ చేయడం. ఇక కలవాలి అనిపిస్తే వాట్సాప్ లో వీడియో కాల్ మాట్లాడటం లాంటివి చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు.  మనసులో అనిపించింది వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకుని అందరికీ తెలియ చేస్తూ ఉన్నారు. ఇలా నేటి రోజుల్లో అన్ని రకాల సేవలను అందిస్తుంది వాట్సాప్.


 అలాంటి వాట్సాప్ ఇటీవలే ఒక ప్రాణం పోవడానికి కారణమైంది. సాధారణంగా ప్రతి ఒక్కరు వాట్సాప్ లో స్టేటస్ పెట్టడం చూస్తూనే ఉంటాం. ఇలా పెట్టిన వాట్సాప్ స్టేటస్ కాస్త యువతి ప్రాణాలు తీసింది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొమ్ముగూడా కు చెందిన యువతి హైదరాబాద్ లో పాలిటెక్నిక్ చదువుతోంది. ఉగాదికి స్వగ్రామానికి వచ్చి గ్రామంలోనే ఉంటుంది. అయితే స్థానికంగా ఉండే యువకుడు అజయ్ యువతితో తీసుకున్న ఫొటోలను వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడు. అయితే ఆ ఫోటోలను తొలగించాలని యువతి తల్లిదండ్రులు కోరినా చివరికి పట్టించుకోలేదు. దీంతో మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది..

మరింత సమాచారం తెలుసుకోండి: