సాధారణంగా డాక్టర్ ప్రత్యక్ష దైవం అని చెబుతూ ఉంటారు పెద్దలు. కరోనా వైరస్ కాలంలో మాత్రం ప్రతి ఒక్కరికీ ఇది స్పష్టంగా అర్థమైంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతోమంది డాక్టర్లను అమితంగా గౌరవించడం వంటివి కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కరోనా వైరస్ కారణం ప్రాణాలతో ఉంటే చాలు ఎదుటివారు ఏమైపోతే మనకు ఏంటి అన్న ధోరణితో అందరు ఉన్న సమయంలో అటు వైద్యులు మాత్రం తమ కుటుంబాలను సైతం రిస్క్ లో పెట్టి ప్రాణాలను పణంగా పెట్టి   చివరికి ఎంతో మందికి చికిత్స అందించి  పునర్జన్మను ప్రసాదించారు అనే చెప్పాలి.


 దీంతో ఈ లోకంలో దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం డాక్టరే దేవుడు అయ్యాడు అంటూ ఎంతో మంది ప్రశంసలు కురిపించారు. ఆ సమయంలో కొంతమంది డాక్టర్లు మాత్రం నిర్లక్ష్య ధోరణితో చికిత్స అందిస్తు ఎంతో ముందు ప్రాణాల మీదకు తెస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.  కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది మహిళ. కానీ చివరికి ప్రాణాలు కోల్పోయింది.


 ఇబ్రహీంపట్నం లోని సీతారామ్ పేటకు చెందిన లావణ్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేయించుకుంది. అయితే ఇంటికి వెళ్లిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది.. ఇక మమత అనే 32 ఏళ్ల మహిళ అదే ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని బి.ఎన్.రెడ్డి సమీపంలోని బృంగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు వదిలింది. ఇక అదే ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మరో మహిళ సుష్మా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండడం గమనార్హం. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించడంతో ఇలా జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. అటు ఆరోగ్య సిబ్బంది మాత్రం తమ తప్పేమీ లేదు అంటూ చెబుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: