సాధారణంగా సినిమాల్లో అసాధ్యం అయిన పనులను కూడా సుసాధ్యం  అన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే అది సినిమా కాబట్టి. కేవలం నటిస్తే సరిపోతుంది కాబట్టి. ఇలాంటి సమయంలోనే కొన్ని సన్నివేశాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. సినిమాల్లో పుట్టుకతో మాట్లాడిన వాళ్ళు మధ్యలో గొంతు కోల్పోతారు. కానీ ఆ తర్వాత ఊహించని షాక్ తగలడంతో మళ్లీ వారికి మాట వస్తుంది. ఇక ఇలాంటివి జరిగినప్పుడు దేవుడు చేసిన అద్భుతం అని లేదా డాక్టర్లు వైద్య చరిత్రలో సంచలనం అని ఏదో ఒకటి చెబుతూ ఉంటారు.


 సినిమాల్లో ఇలా అందరినీ మెప్పించే సన్నివేశాలు నిజ జీవితంలో జరుగుతాయా అంటే మాత్రం.. అబ్బే అలాంటివి సినిమాల్లో బాగుంటాయి.. నిజజీవితంలో జరగడం అసాధ్యం అనే చెబుతారు ప్రతి ఒక్కరు. కానీ ఇక్కడ ఇలాంటిదే జరిగే అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. ఏడేళ్ల వరకు ఆ చిన్నారి ఎంతో గలగల మాట్లాడేది. కానీ ఏమైందో ఒక్కసారిగా గొంతు మూగబోయింది. ఎంతమంది డాక్టర్లు చుట్టూ తిరిగిన లక్షలు ఖర్చు చేసిన ఎలాంటి ఫలితం రాలేదు.. తమ బిడ్డ మళ్లీ మాట్లాడలేదని తల్లిదండ్రులు కూడా ఆశలు వదిలేసుకున్నారు. కానీ సడన్గా ఆమెకు 12 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత గొంతు మళ్ళీ పలికింది. దీంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.


 ముఖ్యంగా తల్లిదండ్రుల ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయి. నిజాంబాద్ జిల్లా భీమ్గల్ మండలం మెండోరా గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం ఆమె వయసు 19 ఏళ్లు కావడం గమనార్హం. అయితే  ఇలా గొంతు పోయిన సుజాత ఆ దంపతులకు మూడో కుమార్తె కావడం గమనార్హం. అయితే 12 ఏళ్ల క్రితం మా చిన్నాన్న చనిపోయారు. ఆ విషయాన్ని ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అప్పుడు తాను వెక్కి వెక్కి  ఏడుస్తుంటే సుజాత వచ్చి నాపై పడింది. ఏమైందో అప్పటినుంచి సుజాత గొంతు మూగబోయింది. వైద్యులను సంప్రదించిన ఫలితం రాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మాటలు రావడం సంతోషంగా ఉంది అని సుజాత తల్లి చెబుతోంది. అయితే ఇలా తనకు మళ్లీ గొంతు ఎలా వచ్చిందో  తెలియదు.. కానీ మాటలు వచ్చినందుకు ఆనందంగా ఉంది అంటూ సుజాత చెబుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: