ఇటీవల కాలంలో అడవులను నరికేస్తూ మనుషులు భవనాలు నిర్మించుకుంటున్న నేపథ్యంలో అడవుల్లో జీవనం సాగించే జంతువులన్నీ ఇక ఇప్పుడు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. క్రూర మృగాలు సైతం జనావాసాల్లోకి వస్తూ దాడులకు పాల్పడుతున్న ఘటనలు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వానరాల గుంపు అయితే ఇలా జనావాసాల్లో తరచూ కలియా తిరుగుతూ ఇక ఆహారం కోసం వెతుకులాట ప్రారంభిస్తున్నాయ్. ఈక్రమంలోనే ఇళ్లల్లోకి ప్రవేశిస్తూ దౌర్జన్యంగా ఆహారం ఎత్తుకుపోవడం లాంటివి కూడా చూస్తూ ఉన్నాము.


 మరికొన్ని ఘటనల్లో ఎవరైనా కోతులను తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తే గుంపుగా వచ్చే కోతులు ఇక వారిపై దాడి చేసి మరి గాయపరచడం లాంటివి చేస్తూ ఉన్నాయి. అదే సమయంలో ఏకంగా ముక్కు పచ్చలారని పసిబిడ్డల విషయంలో కూడా కోతులు దారుణంగా వ్యవహరిస్తున్నాయి అని చెప్పాలి. ఏకంగా పసిబిడ్డలను  ఎత్తుకెళ్లి దారుణంగా ప్రాణాలు తీసేస్తూ ఉన్నాయి.  ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది. పసిబిడ్డ ప్రాణాన్ని ఒక కోతి బలి తీసుకుంది. ఆరు బయట నిద్రిస్తున్న చిన్నారిని కోతి ఈడ్చుకెళ్ళి కింద పడేసింది.


 ఈ ఘటనలో తలకు తీవ్ర గాయం కావడంతో ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది అని చెప్పాలి. పెద్దచెర్లపల్లి మండలం మురుగుమ్మిలో ఈ ఘటన వెలుగు చూసింది. రవీంద్ర, సుమతి దంపతులు బెల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక రెండు నెలల క్రితమే రెండవ కుమార్తె జన్మించింది. ఎప్పటిలాగానే ఇక రెండు నెలల చిన్నారిని ఇంటి బయట మంచంపై పడుకోబెట్టి ఇంటి పనులు చేసుకుంటుంది. ఇలాంటి సమయంలోనే ఇక నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకు వెళ్ళింది కోతి. చిన్నారిని కింద పడేసింది. దీంతో పసికందు వ్యవసాయ సామాగ్రిపై పడడంతో తలకు తీవ్ర గాయం అయింది. ఇక రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. అయితే ఇక అప్పటివరకు తన ముందే నవ్వుతూ కనిపించిన కూతురు విగతజీవిగా మారడంతో తల్లి గుండె పగిలిపోయింది. దీంతో కన్నీరుగా విలపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: