నేటి కలికాలంలో వైద్యులే ప్రత్యక్ష దైవాలు అని ఎంతో మంది పెద్దలు చెబుతూ ఉంటారు . ఎవరు ఎంత చెప్పినా ఎవరికి అర్థం అయ్యేది కాదు. కానీ కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రం పెద్దలు చెప్పింది నిజమే అన్న విషయం అందరికీ బోధపడింది. ఎందుకంటే గుడిలో ఉండే దేవుడు అడిగిన వరాలు ప్రసాదిస్తాడో లేదో తెలియదు గాని.. హాస్పిటల్ లో ఉండే వైద్యుడు మాత్రం అడగకపోయినా ఇక తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడుతూ ఉంటాడు అన్న విషయం కరోనా వైరస్ కాలంలో అర్థం అయింది. దీంతో ఇక వైద్యులపై ప్రతి ఒక్కరికి గౌరవం అమాంతం పెరిగిపోయింది అని చెప్పాలి.


 ఇలా ఎంతోమంది వైద్యులు ఇక తమ దగ్గరికి వచ్చిన పేషంట్లకు మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు నిలబెడుతూ ఉంటే.. కొంతమంది వైద్యులు మాత్రం ఇప్పటికి నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఓ ప్రభుత్వ వైద్యుడు నిర్వాకం బయటపడింది అని చెప్పాలి.  కలెక్టర్ తన స్నేహితుడు అని గొప్పలు చెప్పుకుంటూ.. అటు పేషంట్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు వైద్యుడు నాగరాజు.


అతని దగ్గరికి చికిత్స కోసం వచ్చిన పేషెంట్లు పట్ల ఎంతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. మండల పరిధిలోని గోపాలకుంట గ్రామానికి చెందిన హుస్సేన్ తన పిల్లలకు జ్వరం రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఓపి రాయించుకుని వైద్యుల దగ్గరికి తీసుకెళ్లగా.. పిల్లలు మాస్క్ పెట్టుకు రాలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓపి స్లిప్ చించి వారి మొహం మీద విసిరేసాడు. అయితే ఇలా డాక్టర్ ప్రవర్తించిన తీరు ఇక అక్కడ ఉన్న బాధితులకే కాదు మిగతా పేషంట్లకు కూడా అస్సలు నచ్చలేదు. దీంతో జ్వరంతో వచ్చిన పిల్లలకు వైద్యం అందించకుండా బయటికి పంపించడమేంటంటూ డాక్టర్ ను ప్రశ్నించారు. ఎన్నో రోజుల  నుంచి వైద్యుడు నాగరాజు ఇలాగే అసభ్యంగా అవమానకరంగా ప్రవర్తిస్తున్నాడని.. ఇదేంటని ప్రశ్నిస్తే వీడియోలు తీసి పోలీసులతో కేసు పెట్టిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వైద్యుడి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.

మరింత సమాచారం తెలుసుకోండి: