ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించక చివరికి రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ ఉంటే... మరికొన్నిసార్లు ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వారు ఇక ఎదుటివారి ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారు అని చెప్పాలి.


 వెరసి నేటి రోజుల్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయి రోడ్డును పడుతున్న కుటుంబాలు కూడా ఎక్కువైపోతున్నాయి అని చెప్పాలి. ఇక కొన్ని కొన్ని రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఘటనలు అయితే ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఇక ఇక్కడ ఇలాంటి ఓ ఘోరమైన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వార్త కాస్త ప్రతి ఒక్కరిని కూడా షాక్ కి గురిచేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక వ్యక్తి బైక్ పై వెళ్తూ ఇక రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. అయితే చీకట్లో అతని మృతదేహం కనిపించకపోవడంతో రాత్రంతా అతని మృతదేహం పైనుంచే వాహనాలు రాకపోకలు జరిగాయి అని చెప్పాలి.


 ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. ఆగ్రా ఢిల్లీ హైవేపై ఈ దారుణ ఘటన జరిగింది. రాత్రి ఒక బైక్ రైడర్ వాహనం ఢీకొని మరణించాడు. అయితే పొగ మంచు కారణంగా మృతదేహం వాహనదారులకు ఎక్కడ కనిపించలేదు. దీంతో రాత్రంతా ఆ శవం వాహనాల టైర్ల కింద నుజ్జు నుజ్జుగా మారింది. ఏకంగా 100 మీటర్ల మేర డెడ్ బాడీ భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి అంటే ఇక ఎంత ఘోరం జరిగిందో అర్థం చేసుకోవచ్చు.  ఇక పొగ మంచు తగ్గిన తర్వాత ఒక వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. రోడ్డు పక్కన ఉన్న బైక్ వివరాలను బట్టి ఇక కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: