ఇటీవల కాలంలో దొంగల బెడద ఎక్కడ చూసినా ఎక్కువైపోయింది. అటు పోలీసులు చోరీలను నివారించేందుకు ఎక్కడికక్కడ సిసి కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ దొంగలు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు అని చెప్పాలి. అయితే ఒకప్పుడు తాళం వేసి ఉన్న ఇళ్లల్లోకి వెళ్లి చోరీలకు పాల్పడేవారు. విలువైన వస్తువులు నగదు నగలు లాంటివి దోచుక పోవడం చేసేవారు. అయితే ఇటీవల కాలంలో అటు ఎంతో మంది ఇంటి యజమానులు దొంగలు చోరీకి వచ్చిన ఏమీ దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు.


 ఎంతో కష్టపడి ఇళ్లలోకి రహస్యంగా చొరబడినప్పటికీ కూడా విలువైన వస్తువులు దొరుకుతాయి అన్న గ్యారెంటీ లేకుండా పోయింది.. ఈ క్రమంలోనే నగదు పక్కగా ఉండే ఏటీఎం మెషిన్లను టార్గెట్గా చేసుకుంటున్నారు ఎంతోమంది దొంగలు. ఈ క్రమంలోనే ఇక ఏటీఎం బద్దలు కొట్టి అందిన కాడికి దోచుకుపోతున్న ఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. బీహార్ రాష్ట్రంలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి. ఏకంగా ఏటీఎం లో అర్ధరాత్రి సమయంలో ఒక యువ జంట వెళ్ళింది. ఇక ఆ యువ జంట చేసిన పని మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.


 అర్ధరాత్రి సమయంలో ఏటీఎంలోకి వెళ్లిన యువజంట ఏకంగా ఏటీఎంను బద్దలు కొట్టి అందులో ఉన్న డబ్బులు మొత్తం కొట్టేసేందుకు ప్రయత్నించారు అన్న విషయం మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది అని చెప్పాలి. వెంటనే అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది అటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాత్రి రెండున్నర గంటల సమయంలో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇక ఏటీఎం బద్దలు కొడుతున్న ఓ యువ జంటను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే వారిపై పాత కేసులు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను విచారిస్తూ ప్రస్తుతం ఇక వారిని రిమాండ్ కు  తరలించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Atm