సాధారణంగా పోలీసు ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారు ఇక ప్రజాప్రతినిధుల పట్ల ఎప్పుడు వినియంగానే ఉంటారు . ఎందుకంటే కాస్త రిస్క్ చేసి విమర్శలు చేసిన కూడా ఉద్యోగం ఊడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇక పోలీసు విభాగంలో కొనసాగుతున్న వారు లేదా ఇతర విభాగాల్లో పని చేస్తున్న అధికారులు కూడా ప్రజాప్రతినిధుల జోలికి వెళ్లకుండా వారు చెప్పింది వినడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఏకంగా ఎమ్మెల్యేలు మంత్రులనే కాదు సీఎంను సైతం నేరుగా విమర్శించడం చేస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనలు జరిగాయి అంటే చాలు అది సంచలనంగా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.


 ఇటీవలే నందిగామ చిల్లకల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేపై పెట్రోలింగ్ విభాగంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు.. సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు అన్న విషయం తెలిసిందే  కానిస్టేబుల్ ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన సమయంలో టీ స్టాల్ వ్యక్తికి కానిస్టేబుల్ కి మధ్య సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. టీ స్టాల్ వ్యక్తి వెంకటేశ్వరరావును బాగున్నారా అంటూ పలకరించగా తర్వాత జీతాల గురించి వారి మధ్య ప్రస్తావన వచ్చింది. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు సిఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.


 బండ బూతులు తిట్టేసాడు. అయితే ఇక ఇదంతా టీ స్టాల్ నడుపుతున్న వ్యక్తి రికార్డ్ చేసి పోలీసులకు పంపించాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర రావును అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే ఉద్దేశ పూర్వకంగానే ఆయనను రెచ్చగొట్టి అలాంటి వ్యాఖ్యలు చేసేలా చేశారంటూ కొంతమంది సహచర పోలీసులు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇక కానిస్టేబుల్ తన్నీరు హరీష్ రావు ని కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. ఇటీవల విచారణ జరిగిన తర్వాత కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: