
ఇక ఇప్పుడు ఒక ఇల్లాలు చేసిన పనికి నెటిజన్స్ అంత షాక్ కి గురయ్యారు. మన భారతీయాలపై ఎప్పటి నుంచి ఉన్న ఒక రకమైన సృజనాత్మకత ఇప్పుడు మళ్లి కనిపించింది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకు జనాలు ఇంతలా మాట్లాడుకోవడానికి ఆ మహా ఇల్లాలు ఏం చేసిందో తెలుసా ? ఇంట్లో ఉండే బెడ్ షీట్ పై ప్రొజెక్టర్ ని ప్లే చేసి పెద్ద స్క్రీన్ లా వాడేస్తుంది.
ఆమె చేసిన పనికి షాక్ అయినా ఆమె భర్త మా ఆవిడా ఈ పని చేసి నాకు 20 వేలు మిగిల్చింది అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టాడు. దాంతో ఈ పోస్ట్ చాల త్వరగా వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ని గ్రీకీ రంజిత్ అనే ఒక టెక్కీ ఈ పోస్ట్ ని షేర్ చేశారు. ఆమె చేసిన పనికి నెటిజన్స్ కూడా మెచ్చుకుంటున్నారు. 25 వేలు ఖర్చు పెట్టాల్సిన చోట ఫ్రీ గా ఇలాంటి ఐడియా ఇచ్చింది కాబట్టి ఇక షాపింగ్ కి తీసుకెళ్లండి బ్రదర్ అంటూ కొంత మంది పోస్టులు పెడుతన్నారు. మొత్తానికి ఇలా ఇంట్లో పాత దుస్తులపై ప్రొజెక్టర్లు వేసుకొని ఎంచక్కా సినిమాలు చూడచ్చు అన్నమాట. ఈమెను ఆదర్శంగా తీసుకొని మరికొంత మంది తమ తమ ఐడియాస్ తో ముందుకు వచ్చే అవకాశం లేకపోలేదు.