కావాల్సిన ప‌దార్ధాలు: 
ఆపిల్స్‌ – 3
పంచదార – ముప్పావు కప్పు
నెయ్యి – 1 కప్పు


జీడిపప్పు ముక్కలు – 1 టీ స్పూ న్
బాదం ముక్కలు – 1 టీ స్పూన్‌
ఏలకుల పొడి –  అర టీ స్పూను


తయారి విధానం: 
ఆపిల్స్‌ శుభ్రం చేసుకుని, తొక్కలు తీసుకోవాలి. తొక్క తీసి పెట్ట‌కున్న ఆపిల్స్‌ మిక్సీ వేసి గుజ్జులా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాత్రపెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి వేసుకుని వేడి కాగానే  బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ నెయ్యిలో ఆపిల్‌ గుజ్జు వేసుకుని బాగా కలపాలి. 


స్టో ఫ్లేమ్‌లో పది నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత పంచదార వేసి బాగా కలపాలి. ఇప్పుడు గరిటెతో తిప్పుతూ మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలి. ఆపిల్‌ మిశ్రమం దగ్గరపడగానే  ఏలకుల పొడి, జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు కూడా అందులో వేసి తిప్పుతూ 4 నిమిషాల పాటు ఉడ‌క‌నిచ్చి స్టౌ ఆఫ్ చేయాలి. అంటే య‌మ్మీ య‌మ్మీ ఆపిల్ హ‌ల్వా రెడీ.


మరింత సమాచారం తెలుసుకోండి: