కావాల్సిన ప‌దార్థాలు:
ఓట్స్ - ఒక కప్పు
పెసరపప్పు - అర‌ కప్పు
ఉల్లిపాయ ముక్క‌లు - అరకప్పు

 

క్యారెట్ తురుము - అర క‌ప్పు
గ‌రం మ‌సాలా - అర టీ స్పూన్‌
పెరుగు - ఒక టీస్పూన్‌

 

కారం - ఒక టీ స్పూన్‌
ఉప్పు - రుచికి స‌రిప‌డా
నూనె - సరిపడినంత
కొత్తి మీర - ఒక కట్ట

 

త‌యారీ విధానం: 
ముందుగా ఒక క‌ప్పు నీటిలో పెసరపప్పును నానబెట్టుకోవాలి. ఆ త‌ర్వాత కుక్క‌ర్ తీసుకుని.. పెస‌ర‌ప‌ప్పు వేసి పేస్టులా కాకుండా కాస్త పలుగ్గానే ఉండేట్టు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె లేకుండా ఓట్స్ ని వేసి వేయించి ప‌క్క‌న పెట్టుకోవాలి.

IHG's Kitchen

అనంత‌రం ఓట్స్ ని పొడిలా చేసి పెసర రుబ్బులో వేసి బాగా కలపాలి. సన్నగా తరిగిన ఉల్లి, క్యారెట్, గ‌రం మాసాలా, కొత్తిమీర తరుగును వేసి బాగా కలపాలి. అలాగే  పెరుగు, కారం, ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

IHG

ఇప్పుడు స్టమ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడెక్కాక.. ముందుగా క‌లిని పెట్టుకున్న పిండిని వడలు మాదిరిగా వేసుకోవాలి. మంచి రంగులోకి వ‌చ్చాక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే ఓట్స్ వడలు రెడీ అయిన‌ట్లే. సాయంత్రం వేళ వీటిని వేడి వేడిగా ఉన్న‌ప్పుడు ఏదైనా చ‌ట్నీతో తింటే అద్భుతంగా ఉంటాయి. పిల్ల‌లు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. కాబ‌ట్టి, మీరు కూడా ఈ టేస్టీ ఓట్స్‌ వడలు త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: