నిన్నటి రోజు నుంచి తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రేణు దేశాయ్. కుక్కల కారణంగా మనిషి చనిపోతే స్పందించే వ్యవస్థలు ఉన్నాయి. కానీ రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఆత్యాచారాల పైన ఎందుకు స్పందించడం లేదంటూ మీడియా ముఖంగా నిన్నటి రోజున రేణు దేశాయ్ ఫైర్ అయ్యింది. ఈ విషయం పైన యాంకర్ రష్మీ కూడా రేణు దేశాయ్ కి సపోర్టివ్ గానే మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. దీంతో వీరిద్దరూ వీధి కుక్కలను చంపడం పైన తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని తెలిపారు.



ఒక కుక్క కరుస్తోందని వందల కుక్కలను చంపేయడం సరైనది కాదు కదా అంటూ తెలిపారు. సమాజంలో చిన్నారుల పైన జరుగుతున్న అత్యాచారాలపై ఎవరు స్పందించడం లేదు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ 100 కుక్కలను చంపడం చాలా అమానుషం. కుక్కలవి మాత్రం ప్రాణాలు కాదా? ఆవు, పిల్లి ,కోతి , గేదెల వన్ని ప్రాణాలే మనుషులతో పాటు అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉందని.. వీధి కుక్కలు సంఖ్య పెరగడానికి ముఖ్య కారణం మన చుట్టూ ఉన్న అపరిశుభ్రత పరిస్థితిలే అంటూ తెలియజేసింది. వీటికి కారణమైన సమస్యల పైన ఎవరు స్పందించరు. కానీ కుక్కల గురించి మాట్లాడతారు ఇదెక్కడి న్యాయం అంటూ ఫైర్ అయ్యింది రేణు దేశాయ్.


2019లో దోమల కాటు వల్ల తనకు డెంగీ జ్వరం వచ్చిందని , ఆ సమయంలో తాను మరణించేంత పని అయ్యింది. ప్రభుత్వం అప్పుడు దోమల మీద ఎలాంటి నివారణ చేపట్టింది..కొంతమంది నిద్రలేచిన దగ్గర నుంచి కాలభైరవుడిని పూజిస్తారు. కానీ మరొకవైపు కుక్కలను చంపుతారు.కర్మ ఎవరిని విడిచిపెట్టదు. ఎవడో ఒకడు అత్యాచారం చేశాడని మగవాళ్ళు అందరిని చంపేయలేం కదా. నేను ఇలా మాట్లాడినందుకు నన్ను జైల్లో పెట్టిన పర్వాలేదు. నేను అన్ని చూసుకోగలను ఈ దేశంలో ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంటుంది. బైకులు ఢీ కొట్టడం వల్ల రోజుకి వందల కుక్కలు గాయాలు అవుతున్నాయి. అవి ఎవరి దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేయవు, దోమల వల్ల లక్షల మంది మరణిస్తున్నారు వాళ్ల ప్రాణాలు అంటే లెక్క లేదా.. తాను పెట్టిన ఈ ప్రెస్ మీట్ వల్ల తన మీద నెగెటివిటీ పెరగవచ్చు, అసభ్య పదాలతో తిడతారు. అయినా నేను భయపడను దీనివల్ల ఏ ఒక్కరైనా మారుతారని ఆశ ఉందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: