ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ కుకింగ్ ఆర్టికల్ చదవండి.. తెలుగువారికి ఇష్టమైన వంటకాలలో గారెలు కూడా ఒకటి. గారెలు అంటే ఇష్టపడని తెలుగు వారుండరు. చాలా క్రిస్పీ గా ఉంటాయి. పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో కచ్చితంగా గారెలు ఉండాల్సిందే. గారెలలో అల్లం గారెలు ఒకరకం. ఇవి తయారు చేయడం కూడా చాలా సులభం. కొబ్బరి చెట్నీతో కానీ,సాంబార్‌తో కానీ ఈ గారెలు తింటే చాలా బాగుంటాయి. వర్షాకాలంలో సాయంత్రం సమయాల్లో తినే స్నాక్స్‌గా ఈ గారెలు చక్కగా నప్పుతాయి. మరి వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం...

అల్లం గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు...

మినప్పప్పు - 2 కప్పులు
అల్లం ముద్ద - 2 టీస్పూన్లు
పచ్చిమిర్చి - నాలుగు
జీలకర్ర - 2 టీస్పూన్లు,
మిరియాలు - అర టీస్పూను
ఎండుకొబ్బరి తురుము - టీస్పూను
ఉప్పు - 2 టీస్పూన్లు
లవంగాలు - రెండు
దాల్చినచెక్క - చిన్న ముక్క
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడాఅల్లం గారెలు

అల్లం గారెలు తయారుచేసే విధానం...

అల్లం గారెల తయారుచేసుకోవడానికి.. ముందుగానే మినప్పప్పుని నానబెట్టుకోవాలి.
మినప్పప్పు మినహా మిగిలినవన్నీ వేసి బాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులోనే మినప్పప్పు కూడా వేసి రుబ్బాలి.
ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని గారెల మాదిరిగా చేసి.. మరిగిన నూనెలో వేయించి తీయాలి. అంతే వేడివేడిగా ఘూటుఘూటుగా ఉండే అల్లం వడలు రెడీ అయినట్లే.. ఏ చట్నీతో అయినా ఈ గారెలను లాగించొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి...

ఇలాంటి మరెన్నో కుకింగ్ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...










మరింత సమాచారం తెలుసుకోండి: