ఈ చలికాలంలో మీరు బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రెండు రకాల పిండిలను మీ ఆహారంలో వినియోగించండి.

బుక్వీట్ పిండి

బుక్వీట్ పిండి బరువు తగ్గడానికి అద్భుతాలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో 75 శాతం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, 25 శాతం అధిక-నాణ్యత గల ప్రోటీన్ ఉన్నాయి. ఇది బరువు తగ్గడానికి చూసేవారికి అనువైన ఆహారం. కుట్టు పిండితో చేసిన ఆహారాన్ని తినడం వల్ల బరువు తగ్గుతుంది. ఇందులో గోధుమ పిండి కంటే తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతుంది. కుట్టు, బుక్వీట్ పిండి ఒక పండ్ల విత్తనం నుండి తయారవుతుంది. అందుకే ఉపవాస సమయంలో దీనిని తింటారు. ఈ పిండి మంచి రుచిని కలిగి ఉంటుంది. సాధారణ గోధుమ పిండికి జిగురు లేని ప్రత్యామ్నాయమే ఈ పిండి. కుట్టు కా ఆటా శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. అందుకే చలికాలంలో ఇది బెస్ట్ ఆప్షన్. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారికి, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడేవారికి కూడా ఈ పిండి చాలా మంచిది. అంతేకాక, ఇందులో విటమిన్స్, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉన్నాయి.


సింఘర పిండి..

సింఘర అటాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. తద్వారా వేరే ఆహారం అతిగా తినకుండా ఆపుతుంది. ఈ పిండిలో పొటాషియం అధికంగా ఉంటుంది. సోడియం తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో నీటిని నిలుపుకోవటానికి సాయపడుతుంది. ఇది మాత్రమే కాదు, సింహారా పిండి సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఇనుము, జింక్ వంటి ఇతర శక్తిని పెంచే పోషకాలు ఉంటాయి. ఉపవాసం సమయంలో, మీరు తినే ఆహారం మీ సాధారణ ఆహారానికి భిన్నంగా ఉన్నందున మీరు శక్తి తక్కువగా ఉందని భావించడం సహజం. మీ ఉపవాస డైట్‌లో సింఘర పిండిని తీసుకోవడం వల్ల మీ శక్తి పెరుగుతుంది. ఈ పిండిలో కొలెస్ట్రాల్ ఉండదు. అధికంగా ఖనిజాలు, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఈ పిండి రాగి, రిబోఫ్లేవిన్‌తో లోడ్ చేయబడింది. ఇది మీ థైరాయిడ్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. సింఘారా, సింఘాడ ఈ పేర్లతో ఎక్కువగా దొరుకుతుంది. ఇవి కూడా ఎక్కువగా సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతుంది. దీనిని సింఘర, వాటర్ చెస్ట్నట్, వాటర్ కాల్ట్రోప్ అని కూడా పిలుస్తారు. ఇది నీటి అడుగున పెరిగే పండు నుండి తయారవుతుంది. ఇది శీతాకాలపు పండు, అయితే ఇది చెస్ట్నట్ పిండి వంటి ప్రోడక్ట్, ఏడాది పొడవునా ఇది లభిస్తుంది. ఈ పిండిలో పోషకాలు అధికం. వివిధ వంటకాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

ఈ రెండు పిండిలు ఆరోగ్యకరమైనవి, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కుట్టు అటా మన శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుండగా, సింఘర లో శీతలీకరణ లక్షణాలు ఉన్నాయి. రెండు పిండిలోనూ పోషకాలు అధికంగా ఉంటాయి మరియు బరువు తగ్గడానికి రెండు చాలా గొప్పవి. మీరు వాటిని మితంగా వాడాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: