పచ్చి బఠాణీ పరోఠా తయారు చెయ్యడానికి కావలసిన పదార్ధాలు....
గోధుమ పిండి - 3 కప్పులు...
పచ్చి బఠాణీలు - ఒక కప్పు....
పచ్చి మిర్చి ముద్ద - తగినంత....
నువ్వులు - అర టీ స్పూను....
నూనె - తగినంత; కొత్తిమీర....
కరివేపాకు - తగినంత...
నెయ్యి - టీ స్పూను....
జీలకర్ర - అర టీ స్పూను....
ఉప్పు - తగినంత...
పచ్చి బఠాణీ పరోఠా తయారు చేసే విధానం....
ముందుగా పచ్చి బఠాణీలను గంట సేపు నానబెట్టి, కుకర్‌లో ఉంచి ఒక విజిల్ వచ్చాక దించేయాలి. చల్లారాక మెత్తగా గ్రైండ్ చేయాలి. గోధుమ పిండికి పచ్చి బఠాణీ ముద్ద జత చేసి, నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ వేసి బాగా కలిపి, నీళ్లు వేస్తూ చపాతీ పిండిలా కలిపి, అరగంటసేపు నాననివ్వాలి. ఉండలు చేసుకుని, చపాతీ మాదిరిగా ఒత్తాలి ∙పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేస్తూ, కాల్చాలి. పెరుగుతో తింటే రుచిగా ఉంటాయి.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాల గురించి తెలుసుకోండి....
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి