కావలసిన పదార్థాలు:
నెయ్యి – 2 టేబుల్స్పూన్లు
పచ్చిశనగపప్పు – 1 / 2 టీస్పూన్
మినప్పప్పు – 1 / 2 టీస్పూన్
జీలకర్ర – 1 / 2 టీస్పూన్
ఉల్లిపాయ – 1 (చిన్నగా తరిగినది)
పచ్చిమిరపకాయ – 1 (పొడవుగా తరిగినది)
కరివేపాకులు-2 రెమ్మలు
ఇంగువ – చిటికెడు
టొమాటోలు – 2 (చిన్నగా తరిగినవి)
రుచికి సరిపడా ఉప్పు
గరం మసాలా పొడి – 2 టీస్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
బాస్మతీ అన్నం-సరిపడా
కొత్తిమీర- కొద్దిగా
జీడిపప్పులు-కొద్దిగా
తయారీ విధానం :
ముందుగా బాస్మతి రైస్ అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పులు వేపుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత నూనె వేసి పోపు దినుసులు కూడా వేసి వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు కూడా వేయాలి.అవి వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిన వాసన పోయేదాకా వేగించాలి. అవి వేగాక టొమోటో ముక్కలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఆ తరువాత కొంచెం పసుపు , ఉప్పు, ఇంగువ,మసాలా పొడి వేసి వేగనివ్వాలి. నూనె పైకి తేలేదాక ముక్కల్ని వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న బాస్మతి అన్నాన్ని పొయ్యి మీద ఉన్న బాండీలో వేసి కలపాలి. ఉప్పు సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. అలాగే మీకు కారం చాలకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ రైస్ లో కొద్దిగా పైన మసాలా పొడి చల్లి ఒక రెండు నిముషాలు మూత పెట్టండి.. తర్వాత కొత్తిమీర, జీడిపప్పు వేసి గార్నిష్ చేసుకోవాలి..అంతే ఎంతో రుచిగా ఉండే టొమోటో రైస్ రెడీ అయినట్లే.. !
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి