కావాల్సినవి:
గుడ్లు - 5-6 (ఉడికించి పై పొట్టు ఒలిచినవి) ఉల్లిపాయలు - 1 (తరిగినవి)
టమోటా - 1 (తరిగినవి)
కొబ్బరి పాలు - 1/2 కప్పు
నూనె - 3 1/2 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
పోపుకు... ఇంగువ - 1 చిటికెడు
దాల్చిన చెక్క - 1
కరివేపాకు - కొద్దిగా
గుడ్లు - 3 లేదా 4
కారం -సరిపడా
మసాలా చేయడానికి ...
ధనియాలు - 1 1/2 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1/4 స్పూన్
మెంతులు - 1 చిటికెడు
ఆవాలు - 1/4 స్పూన్
తురిమిన కొబ్బరి - 4 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి - 3-4 రెబ్బలు
తయారుచేయు విధానం:
మొదట స్టవ్ వెలిగించి దాని మీద బాండీ పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, మెంతులు వేసి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఇంకా మసాలా దినుసులు వేసి తక్కువ వేడి మీద వేయించాలి.వీటన్నిటిని పొడి చేసుకోవాలి. తర్వాత అదే పాన్ లో 1 1/2 టేబుల్ స్పూన్ నూనె పోసి ఉల్లిపాయ వేసి 6-7 నిమిషాలు వేయించాలి. తరువాత పసుపు పొడి, వెల్లుల్లి మరియు తురిమిన కొబ్బరి వేసి 2-3 నిమిషాలు ఉడికించాలి. తరువాత వేయించిన మసాలా దినుసులు పొడి, ఉల్లిపాయ మరియు కొబ్బరి మిశ్రమాన్ని అందులో జోడించండి. అలాగే మొత్తగా గ్రైండ్ చేసిన కొబ్బరి పాలు లేదా నీరు వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. తరువాత ఉడికించిన గుడ్లు వేసి వేయించాలి. తరువాత తరిగిన ఉల్లిపాయ వేసి 3 నిముషాలు వేయండి, తరువాత టమోటాలు వేసి బాగా మెత్తబడే వరకు వేయించాలి, తరువాత ముక్కలు చేసిన పేస్ట్ వేసి 5 నిమిషాలు ఉడకనివ్వండి.చివరగా ఉప్పు మరియు 3 కప్పుల నీరు వేసి మరిగించాలి. ఇప్పుడు గుడ్డును సగానికి కట్ చేసి, మీడియం వేడి మీద 20 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత కొబ్బరి పాలు పోయండి , 2-3 నిమిషాలు ఉడకబెట్టండి. అంతే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు కొబ్బరి పాలు పులుసు రెడీ అయినట్లే.. !!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి