ప్రస్తుతం యావత్ భారత దేశం మొత్తం కొవిడ్‌ మహమ్మారి కారణంగా భయ బ్రాంతుల్లో ఉంది. ఈ కరోనా కష్ట కాలంలో ప్రతి ఒక్కరు కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి.ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీ శక్తి అనేది అధికంగా ఉండాలి.మరి ఇమ్యూనిటీ శక్తి అనేది పెరగాలంటే మంచి డైట్‌ అనేది తింటూ ఉండాల్సిందే.అది కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం తింటూ ఉండాలి. అప్పుడే ఈ వైరస్ బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే కొన్ని రకాల రెసిపీలను మీకు పరిచయం చేస్తున్నాము. మీరు కూడా ఇవి ఫాలో అవ్వండి. టొమాటో కాధా మసాలా షోర్బా, నాన్‌ వెజ్‌ రెసిపీలైన  ముర్గ్‌ మలాయి కబాబ్ వంటి వంటలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. 

1)టొమాటో కాధా మసాలా షోర్బా తయారీ విధానం :


కావలసినవి:


టొమాటో - 300గ్రా, క్యారెట్‌ - 100గ్రా, వెల్లుల్లి - 50గ్రా, కొత్తిమీర వేళ్లు - కొద్దిగా, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - 30గ్రా, ఉల్లిపాయలు - 100గ్రా, నూనె - సరిపడా, యాలకులు - 30గ్రా, లవంగాలు - 30గ్రా, దాల్చిన చెక్క - 30గ్రా, సాజీరా - 30 గ్రా

తయారీ విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా,వెల్లుల్లి వేసి వేపాలి. అవి వేగిన తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసి మెత్తగా అయ్యేదాకా వేపాలి.ఇప్పుడు అందులో ఒక రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. తరువాత కొద్దిగా ఉప్పు, క్యారెట్ తురుము, కొత్తిమీర వేళ్ళు వేసి బాగా కాగనివ్వాలి. ఒక పావుగంట పాటు కాగక సరిపడా ఉప్పు వేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. 

2)ముర్గ్‌ మలాయి కబాబ్‌


కావలసినవి:


బోన్‌లెస్‌ చికెన్‌ - ఒకకేజీ, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - 100గ్రా, నిమ్మకాయలు - నాలుగు, అల్లంవెల్లుల్లి పేస్టు - 50గ్రా, పెరుగు - 100గ్రా, జీడిపప్పు - 100గ్రా, జీలకర్ర పొడి - 50గ్రా, మెంతిపొడి - 50గ్రా, గరంమసాల - 50గ్రా, తెల్లమిరియాల పొడి - 50గ్రా, కుకింగ్‌ క్రీమ్‌ - 100ఎంఎల్‌.


తయారీ విధానం :

ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో చికెన్ ముక్కలు వేయాలి. కొద్దిగా ఉప్పు,పసుపు కూడా వేయాలి. నీళ్లు అన్ని ఇగిరిపోయేవరకు ఉంచాలి.నీళ్లు ఇగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేయాలి. మరొక పాన్ పొయ్యి మీద పెట్టి జిడిపప్పు వేయించుకోండి. తరువాత అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసి వేపాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపాలి అన్ని వేగాక చికెన్ ముక్కలు కూడా వేయాలి. తరువాత కొద్దిగా పెరుగు వేసి, జీలకర్ర పొడి, మెంతిపొడి, మిరియాల పొడి వేసి వేపాలి.చివరలో గరం మసాలా వేసి కుకింగ్ క్రీమ్ వేసి స్టవ్ ఆఫ్ చేయండి. వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేయండి. చాలా స్పైసీగా రుచికరంగా ఉంటుంది  మరింత సమాచారం తెలుసుకోండి: